Begin typing your search above and press return to search.
వైసీపీ కాపుల జాతకం పవన్ చేతుల్లో...?
By: Tupaki Desk | 6 Jan 2023 6:00 AM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం మీద ఇపుడు వైసీపీలో హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ఐ ప్యాక్ కూడా ఇదే విషయం మీద గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళి సర్వేల మీద సర్వేలు చేస్తోంది అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం ఎంత అన్న దాని మీదనే ఐ ప్యాక్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఈ జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అలాగే అయిదు ఎంపీ సీట్లు ఉన్నాయి. వీటిలో ఎనభై శాతం సీట్లను వైసీపీ గత ఎన్నికల్లో గెలుచుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం వైసీపీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవని భావిస్తున్న జిల్లాలలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి అంటున్నారు. పవన్ పార్టీ జనసేన గణనీయంగా గత ఎన్నికల కంటే కూడా ఈసారి పుంజుకున్నది ఇక్కడే అంటున్నారు.
అదే సమయంలో కాపు సామాజికవర్గం గతానికి భిన్నంగా స్పందిస్తారని అంటున్నారు. దాంతో ఐ ప్యాక్ టీం ప్రత్యేక దృష్టిని ఈ జిల్లాల మీద పెట్టింది అని చెబుతున్నారు. కాపుల మనో భావాలు ఎలా ఉన్నాయి, అధికార వైసీపీ మీద వారి ఆలోచనలు ఏంటి, సంక్షేమ పధకాలు కుల సమీకరణలను డామినేట్ చేస్తాయా. కాపులు మొత్తం జనసేన వైపుగా పోలరైజ్ అవుతున్నారా ఇత్యాది విషయాల మీద ఐ ప్యాక్ టీం స్టడీ చేస్తోంది అని తెలుస్తోంది.
ఈ సర్వే నివేదికలే ఇపుడు వైసీపీకి కావాల్సి ఉంది. అదే టైం లో ఈ నివేదికల మీద ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ కాపు నేతలు ఎమ్మెల్యేలు, ఆశావహులు చాలా టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ జిల్లాల నుంచి గణనీయంగా కాపు ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారు. కాకినాడ ఎంపీగా వంగా గీత ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ మళ్లీ దక్కుతుంది అన్నదే చర్చగా కనిపిస్తోంది.
ఐ ప్యాక్ నివేదిక ఆధారంగానే టికెట్లు ఇస్తారు అని అంటున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలలో మాత్రం సీన్ వేరేగా ఉంటుంది అని అంటున్నారు. ఇక్కడ కాపుల ప్రభావం బట్టి టికెట్లు సిట్టింగులకు వస్తాయా రావా అని తేలనుందిట. కాపులు యాభై శాతం దాకా వైసీపీకి మద్దతుగా నిలిస్తే ఆ సామాజికవర్గం సిట్టింగులు అయినా కొత్తగా టికెట్లు కోరుకున్న వారు అయినా మళ్లీ టికెట్లు పొందగలరు అని అంటున్నారు.
అలా కాకుండా మెజారిటీ సెక్షన్ కాపులు జనసేన వైపు ట్రావెల్ అవుతూంటే మాత్రం వైసీపీ కాపు సిట్టింగులు ఆశలు వదులుకోవాల్సిందే అని అంటున్నారు. అపుడు వైసీపీ ప్లాన్ బీని బయటకు తీసి అమలు చేస్తుంది అని తెలుస్తోంది. అదేంటి అంటే బీసీలు ఎస్సీలకు కాపు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లలో నిలబెడతారు అని అంటున్నారు. అంటే కాపుల పోలరైజేషన్ని ఈ విధంగా బీసీలు ఎస్సీలతో అడ్డుకోవాలని చెక్ పెట్టాలని వైసీపీ నయా రాజకీయ వ్యూహరచన చేస్తోంది అని అంటున్నారు.
మరి ఉమ్మడి గోదావరి జిల్లాలలో కాపులు ఎవరికి జై కొడుతున్నారు, వైసీపీకి యాభై శాతం మద్దతు దక్కుతుందా అన్నది ఐ ప్యాక్ టీం త్వరలో ఇవ్వబోయే నివేదికను బట్టి తెలుస్తుంది అని అంటున్నారు. ఈ కుల సమీకరణల వల్ల బాగా పనిచేసి పనిమంతులుగా పేరు తెచ్చుకున్న వారు సైతం టికెట్లు కోల్పోయే ముప్పు పొంచి ఉందని వైసీపీలో అయితే గుసగుసలు వినిపిస్తున్నాయి మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.