Begin typing your search above and press return to search.
అసెంబ్లీ మైకు రెడీ... అనిల్ సౌండ్ లేదుగా!
By: Tupaki Desk | 18 Sept 2022 5:00 AM ISTఆయన ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండవ దఫా ఏకంగా కీలకమైన జలవనరుల శాఖకే మంత్రిగా అయిపోయారు. వైసీపీ సర్కార్ ఇలా రావడంతో అలా అనిల్ ని మినిష్టర్ హోదా దక్కింది. దాంతో తొలి మూడేళ్ళూ ఆయన దూకుడు ఏంటో మైకులే చెప్పేవి. ఆయన మాట్లాడితే అసెంబ్లీ మైకులే దద్దరిల్లేవి. అలాంటి అనిల్ తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడా వినిపించడంలేదేంటి అన్న చర్చ అయితే వస్తోంది.
ఈసారి వైసీపీ సర్కార్ తన వాదన గట్టిగా ప్రజలలోకి పోవాలని భావిస్తోంది. అందుకోసం పెద్ద గొంతు ఉన్న వారిని ముందు పెట్టి మరీ మాట్లాడిస్తోంది. అలా చాలా మంది కొత్తవారు మైక్ టెస్టింగ్ అంటూ అసెంబ్లీలో అదరగొడుతున్నారు. కానీ దీనికి ముందు దాకా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హడావుడి చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ వాయిస్ అయితే ఇపుడు ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయిందిట.
దానికి కారణాలు ఏంటో మాత్రం వైసీపీ నేతలకు అర్ధం కావడంలేదు అని అంటున్నారు. మైక్ పట్టుకుని మరీ జగనన్న అంటూ తెగ పొగుడుతూ అదే టైమ్ లో విపక్షం మీద ఒక రేంజిలో సౌండ్ చేసే అనిల్ గొంతు మూగపోవడం వెనక రీజన్స్ ఏంటో అన్న చర్చ కూడా సాగుతోంది. ఇదే సభలో మాజీ మంత్రి కొడాలి నాని పదవి పోయినా గొంతు బాగానే సవరించారు. గట్టిగానే విపక్షాన్ని అటాక్ చేశారు.
మరి నెల్లూరు జిల్లాలో నిన్నటిదాకా తనకు తిరుగులేదని అనుకున్న అనిల్ మాత్రం ఇపుడు ఇలా తనకెందుకు అన్నట్లుగా ఉండడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది. జగన్ అంటే విపరీతమైన ప్రేమాభిమానాలు కనబరచే అనిల్ ఇపుడు సైలెంట్ కావడం వెనక అధినాయకత్వం పోకడలే అని వైసీపీలో అనుకుంటున్నారుట. జగన్ని ఆరాధించి టీడీపీతో పోరాడిన అనిల్ కి ఇపుడు సొంత పార్టీ వారే గోతులు తీస్తున్నారని, అయినా జగన్ పట్టించుకోవడం లేదు అన్న బాధ అయితే అనిల్ లో బాగా ఉంది అని అంటున్నారు.
ఇక నెల్లూరు జిల్లాలో చూస్తే అనిల్ ని వచ్చే ఎన్నికల్లో నెగ్గించకూడదని సొంత పార్టీలోనే వ్యూహాలు రచిస్తున్న వాతావరణం కూడా ఉందిట. దీని మీద అనిల్ చాలా సార్లు బాహాటంగానే సొంత పార్టీ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. అయినా సరే హై కమాండ్ పెద్దగా పట్టించుకోలేదు అని అంటున్నారు. దానితో పాటు మూడేళ్ల పాటు మంత్రిగా ఉంటూ చంద్రబాబు లోకేష్ ని ఒక లెక్కన విమర్శించిన అనిల్ ఇపుడు తనకెందుకు అన్నట్లుగా ఉండడం వెనక పదవి పోయిందన్న బెంగ కూడా ఉందని అంటున్నారు.
అలా ఆయన ఒక్కరే కాదు, మంత్రి పదవిని ఆశించిన భంగపడిన అదే నెల్లూరు జిల్లాకు చెందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఈసారి సభలో హుషార్ చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. అలాగే ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన ఉదయభాను, పల్నాడు జిల్లాకు చెందిన పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి వారు కూడా నోరు చేసుకోవడంలేదు అని వైసీపీ వారే గుర్తు చేస్తున్నారు.
వీరంతా మౌనంగా ఉంటూ తన అసంతృప్తిని హై కమాండ్ కి అలా తెలియచేస్తున్నారు అని చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తూంటే వైసీపీలో మంత్రివర్గ విస్తరణ నాటి అసంతృప్తి ఇంకా చల్లారలేదని, అలాగే వేడిగా వాడిగా ఉందనే అంటున్నారు. అందుకే నెల్లూరు ఫైర్ బ్రాండ్ అనిల్ కూడా మౌనమే నా భాష అని అంటున్నారని, అలా ఉంటున్నారని కూడా టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.