Begin typing your search above and press return to search.

అవంతిని అస్సలు వదలట్లేదుగా... మ్యాటరేంటో మరి...

By:  Tupaki Desk   |   18 Oct 2022 11:32 AM GMT
అవంతిని అస్సలు వదలట్లేదుగా... మ్యాటరేంటో మరి...
X
ఆయన విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి. వైసీపీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్. ఆయన రాజకీయ జీవితాన్ని మొదలెట్టింది ప్రజారాజ్యం పార్టీ ద్వారానే. ఆ పార్టీ నుంచే 2009 ఎన్నికల్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత అందరితో పాటే ఆయన కాంగ్రెస్ ఆ మీదట టీడీపీలలో ఉన్నారు. ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు. మంత్రి కూడా అయ్యారు.

అయితే అవంతి శ్రీనివాసరావు పవన్ మీద పెద్దగా విమర్శించిన సందర్భాలు లేవు. ఆయన మంత్రిగా ఉన్నపుడు కొన్ని సార్లు మాత్రమే పవన్ మాటలకు జవాబు ఇచ్చారు. అయితే ఆరు నెలలుగా మాజీ మంత్రి అయ్యారు.

దాంతో ఆయన అసలు పెద్దగా దేని మీద రియాక్ట్ కావడంలేదు. అలాంటిది పవన్ ఈ ఏడాది మార్చిలో జరిగిన తన పార్టీ ఆవిర్భావ సభలో అప్పటి మంత్రులు అయిన అవంతిని, వెల్లంపల్లిని పట్టుకుని కామెంట్స్ చేశారు. అవంతిని బంతి చామంతి అని కూడా విమర్శించారు.

మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత మంగళగిరి పార్టీ ఆఫీసులో పార్టీ కార్యకర్తలతో పవన్ మాట్లాడుతూ అవంతి మీద సడెన్ గా కామెంట్స్ చేశారు. బంతీ చామంతీ అంటూ ఆయన మరోసారి విమర్శలు గుప్పించారు. దాంతో ఎందుకు అవంతి మీద ఇలా పవన్ తరచూ కామెంట్స్ చేస్తున్నారు అన్న చర్చ వస్తోంది. పోనీ అవంతి ఏమైనా రెగ్యులర్ గా పవన్ మీద విమర్శలు చేసే బ్యాచా అంటే కానే కాదు.

అయితే అవంతి ప్రజారాజ్యం పొలిటికల్ ప్రాడక్ట్ అని అలాంటి అవంతి తాను పెట్టిన జనసేనను కాదని వైసీపీలో చేరడం పట్ల పవన్ చాలా సార్లు ఫీల్ అయ్యారని, దాని వల్లనే ఆయన ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉండగా దీని మీద అవంతి ఏ విధమైన రియాక్షన్ ఇస్తారో చూడాలి. మరో మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం అవంతి మీద ఈ రకమైన మాటలు ఏంటి అని ఫైర్ అయ్యారు.

ఇక ఉత్తరాంధ్రా మీద ప్రేమ ఉంటే వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకోలేకపోతున్నాయని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రాలో అనేక సమస్యలు ఉంటే వాటిని పక్కన పెట్టారని కూడా నిందించారు. తాను ఉత్తరాంధ్రా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పవన్ అంటున్నారు. అంతే కాదు స్టీల్ ప్లాంట్ విషయంలో ఉక్కు కార్మికులకు మద్దతుగా పోరాటం చేస్తామని కూడా పవన్ చెప్పడం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.