Begin typing your search above and press return to search.
ముత్తంశెట్టి రాజకీయానికి ఎండ్ కార్డు...?
By: Tupaki Desk | 25 Nov 2022 3:30 AM GMTరాజకీయాల్లో అంతే. ఎపుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అదృష్టం తలుపు తట్టి చోటిచ్చిందని సంబరపడేలోగా జెట్ స్పీడ్ తో బ్యాడ్ లక్ కూడా వచ్చి పక్కన చేరుతుంది. ఇపుడు అలాంటి బ్యాడ్ లక్ తో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇబ్బంది పడుతున్నారు. ఆయన రాజకీయానికి ఎండ్ కార్డు పడిపోయిందా అన్న చర్చ కూడా సాగుతోంది.
ఆయన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడిగా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని నుంచి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఆయన భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత పీయార్పీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో అందులో ఉన్నారు. 2014 నాటికి టీడీపీలోకి గంటాతో పాటు వచ్చారు. ఇక ఆ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు.
అదే ముత్తంశెట్టి 2019 ఎన్నికల ముందు గోడ దూకేశారు. తనకు మంత్రి కావాలని ఉంది. దాంతో మంత్రి పదవి ఇస్తేనే పార్టీ మారుతాను అని జగన్ తో ముందుగానే మాట్లాడుకుని వైసీపీ జెండా పట్టుకున్నారు. ఆయన జంపింగ్ సూపర్ హిట్ అయింది. ఆయనా గెలిచారు, వైసీపీ గెలిచింది, అనుకున్నట్లుగా మంత్రి అయ్యారు. దాదాపుగా మూడేళ్ల పాటు మంత్రి కుర్చీలో ఉన్నారు అన్న మాటే కానీ పవర్ చూపించి గట్టిగా కమాండ్ చేయలేకపోయారు.
ఉత్తరాంధ్రాకు కానీ విశాఖ జిల్లాకు కానీ కనీసం ఒక టూరిజం ప్రాజెక్ట్ ని ఆ శాఖ మంత్రిగా తేలేకపోయారు. అలాగే కల్చరల్ మినిస్టర్ గా కళాకారులను ఆదుకునే కార్యక్రమం చేయలేకపోయారు. మొత్తానికి ఏదోలా పదవిని ఎంజాయ్ చేస్తున్న టైం లోనే మంత్రి పదవి పోయి మాజీ అయ్యారు. ఇక ఏడు నెలల క్రితం ముత్తంశెట్టికి విశాఖ జిల్లా ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. ఆయన ఈ ఏడు నెలలలో పార్టీని కూడా బలోపేతం చేయలేకపోతున్నారు అని భావించారో ఏమో ఆ పదవి కూడా ఊడింది.
ఇపుడు అవంతి ఏమీ కాకుండా పోయారు అని అంటున్నారు. నిజానికి అవంతిది స్వయంకృతాపరాధం అన్న వారూ ఉన్నారు. ఆయన మీద వచ్చిన అశ్లీల ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయి పరువు తీశాయి. ఆయన మీద టీడీపీ విమర్శలు చేసినపుడు గంటా అరగంటా అంటూ ర్యాగింగ్ చేసే విధంగా కధ మారింది. దాంతో పాటు రీసెంట్ గా మరో ఆడియో బయటకు వచ్చింది. అందులో బంగారం అంటూ అవంతి మాట్లాడినట్లుగా ఉంది.
అయితే ఆ ఆడియోలో వాయిస్ తనది కాదని ఇమిటేట్ చేసి తన పరువు తీశారంటూ ముత్తంశెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విషయం ఎలా ఉన్నా వైసీపీ హై కమాండ్ మాత్రం ముత్తంసెట్టి ని కంటిన్యూ చేస్తే పార్టీ ట్రబుల్స్ లో పడుతుంది అని భావించినట్లుంది, పైగా జిల్లా ప్రెసిడెంట్ గా ఆయన తన మార్క్ ని చూపించడంలేదని అనుకుని ఏకంగా తీసి పక్కన పెట్టేసింది.
ఇపుడు అవంతికి ఏ పదవీ లేదు, ఎమ్మెల్యే పదవీ కాలం మరో ఏణ్ణర్ధంలో ముగుస్తుంది. ఇప్పటికే హై కమాండ్ ఇండినేషన్స్ బట్టి చూస్తూంటే ముత్తంశెట్టికి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదు అని ఘంటాపధంగా చెప్పేస్తున్నారు. భీమిలీలో చేసిన సర్వేలో ముత్తంశెట్టికి యాంటీగానే అంతా వచ్చిందంట.
దాంతో ముందుగానే ఆయనను పక్కన పెట్టేందుకే పార్టీ పదవి నుంచి తప్పించారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే రాజకీయంగా ఎగిసిపడి ఎమ్మెల్యే, ఎంపీ మంత్రి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా అనేక పదవులు చేపట్టిన ముత్తంశెట్టి సీన్ ఇపుడు తిరగబడిందా అన్న చర్చ అయితే పార్టీ బయటా లోపలా సాగుతోంది. మరి ఆయన ఏ ప్లాన్ వేసి తన రాజకీయాన్ని కంటిన్యూ చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.