Begin typing your search above and press return to search.
వైసీపీని యాంటీ కమ్మగా చేస్తున్న గుడివాడ?
By: Tupaki Desk | 18 Oct 2022 3:32 PM GMTఆయన మంత్రి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్నారు. అందరు రాజకీయ నాయకులు మాట్లాడే భాషను ఆయన అసలు మాట్లాడకూడదు. కానీ ఆ యువ మంత్రి మాత్రం అధినాయకత్వం వద్ద మంచి మార్కులు వేయించుకోవడానికి ఇటీవల కాలంలో నోరు బాగా పెంచేస్తున్నారు అని కామెంట్స్ పడుతునాయి. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమరనాధ్. ఆయన తండ్రి దివంగత నేత గురునాధరావు కాంగ్రెస్ లో మాజీ మంత్రి. ఆయన తనువు చాలించాక కాంగ్రెస్ పట్టించుకోకపోతే టీడీపీ గుడివాడ కుటుంబాన్ని ఆదరించింది.
ఇక ఆనాడు గుడివాడ తల్లికి ఎమ్మెల్యే టికెట్ కూడా ప్రోత్సహించింది. అప్పటికీ గుడివాడ జూనియర్ అని. ఆ తరువాత ఆయనకు కూడా 2006లో విశాఖలో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో కార్పోరేటర్ గా చాన్స్ ఇచ్చింది టీడీపీయే అని గుర్తు చేస్తున్నారు. అపుడు టీడీపీలో కనబడని కమ్మదనం ఇపుడు గుడివాడకు కనిపించడం దారుణం అని అంటున్నారు. ఇక టీడీపీకి నాడే అలాంటి కుల భావన ఉంటే గుడివాడ కుటుంబాన్ని ఎలా చేరదీస్తుంది అన్న ప్రశ్న కూడా తమ్ముళ్ళ నుంచి వస్తోంది.
మరో వైపు చూస్తే గుడివాడ గురునాధరావు మరణం తరువాత టీడీపీ కనుక ఆ ఫ్యామిలీని చేరదీయకపోయి ఉంటే రాజకీయంగా వారు ఈపాటికి ఎక్కడో ఆగిపోయేవారు అని కూడా గుర్తు చేస్తున్నారు. అలా టీడీపీ ఇచ్చిన రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకుని ఎదిగి ఇపుడు అదే పార్టీని విమర్శించడం తగదని అంటున్నారు. ఇక జనసేన కాపుల జనసేన కాదని కమ్మ సేన అని గుడివాడ చాలా సందర్భాలలో విమర్శలు చేస్తూ వచ్చారు.
తనకు కులమే లేదని, అన్ని వర్గాల అభ్యున్నతి కోసమే పార్టీ పెట్టాను అని పవన్ చెప్పుకుంటూంటే గుడివాడ మాత్రం కాపుల జనసేన కాదు, కమ్మ జనసేన అనడం ద్వారా విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు అని అంటున్నారు. ఇక జనసేనలో నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గం అని ఆయన చంద్రబాబుతో జనసేనను కలిపేందుకు డైరెక్టర్ గా పనిచేసారని చివరికి చంద్రబాబు నాదెండ్ల షేక్ హ్యాండ్ తీసుకోవడం ద్వారా కళ్లతోనే ఇద్దరూ నవ్వులు చిందించారు అని గుడివాడ కామెంట్స్ చేశారు.
మొత్తానికి చూస్తే జనసేన ఒక రాజకీయ పార్టీ, టీడీపీ మరో రాజకీయ పార్టీ రెండు పార్టీలలోనూ అన్ని కులాలూ ఉన్నాయి. అలాగే వైసీపీలో కూడా కమ్మ వారు ఉన్నారు. కొడాలి నాని వంటి వారు వైసీపీకి ఎంతో విశ్వాసంగా పనిచేస్తున్నారు. మరి కమ్మ జనసేన అంటూ విమర్శించడం ద్వారా గుడివాడ ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడం అవగాహనా రాహిత్యమే అంటున్నారు.
దీని వల్ల కమ్మలలో కూడా వైసీపీ పట్ల అభిమానం ఉన్న వారు సైతం దూరం అయ్యే పరిస్థితిని మంత్రి కల్పిస్తున్నారా అన్న మాట కూడా వినిపిస్తోంది. గుడివాడ ఇకనైనా కులాలను పక్కన పెట్టి విమర్శలు చేస్తే ఆయనకూ ఆయన ఉంటున్న పార్టీకి కూడా మంచిదన్న సూచనలు వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.