Begin typing your search above and press return to search.
ఆ మంత్రి గారు ఏ గడపలో తిరగాలి బాస్ ...?
By: Tupaki Desk | 18 Dec 2022 2:30 AM GMTఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమరనాధ్ పనితీరు బాలేదంటూ తాజాగా జరిగిన వర్క్ షాప్ లో జగన్ చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన గడప గడపకూ అధినాయకత్వం చెప్పిన దానికి అనుగుణంగా తిరగడం లేదని అంటున్నారు. గుడివాడ ఉండేది గాజువాక నియోజకవర్గం. ఆయన రాజకీయాలు చేసేది విశాఖ సిటీలో. ఆయన ఎన్నికల్లో నెగ్గింది అనకాపల్లిలో. ఇక తాడేపల్లి వెళ్ళి రావడం షరామామూలే.
ఇదిలా ఉండగా గాజువాకకు చెందిన గుడివాడకు అనకాపల్లి టికెట్ ఇచ్చారు జగన్. ఆయన 2019 ఎన్నికల్లో గెలిచారు. బాగానే ఉంది కానీ ఆ తరువాత అక్కడ నాన్ లోకల్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో స్థానికంగా ఉన్న వారికే టికెట్ అని వైసీపీలో నాయకులు వాయిస్ వినిపిస్తున్నారు. దాంతో మంత్రి గుడివాడ కంగారు పడుతున్నారు. ఈ విషయం హై కమాండ్ వరకూ చేరడంతో జగన్ ఆయన్ని వేరే సేఫెస్ట్ ప్లేస్ చూసుకోమన్నారు అని టాక్.
అలా గుడివాడ పెందుర్తి, గాజువాక, ఎలమంచిలి సీట్ల మీద కన్నేసి ఉంచారు. అయితే ఆయా సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సొంత పార్టీ వారే ఉన్నారు. వారు గుడివాడ రాకను వ్యతిరేకిస్తున్నారు. వారు ప్రస్తుతం ఎమ్మెల్యేలు కాబట్టి వారి వర్గం గట్టిగా ఉంది. ఇప్పటికిపుడు గుడివాడ వెళ్ళి అక్కడ పనిచేయడానికి లేదు. చేసినా అది గొడవ అవుతుంది. ఇక వచ్చే ఎన్నికల వేళ అధినాయకత్వం ఈ మూడు సీట్లలో ఒకదానిలో గుడివాడకు టికెట్ ఇచ్చినా అప్పటివరకూ ఎమ్మెల్యేలుగా ఉన్న వారి సహకారం నూటికి నూరు శాతం ఉంటేనే తప్ప గుడివాడ గెలవలేరు.
దాంతో ఆయన పరిస్థితి బిగ్ ట్రబుల్ లో పడింది అంటున్నారు. అనకాపల్లి నుంచి మళ్లీ గుడివాడ పోటీ చేయరు, టికెట్ అక్కడ ఇవ్వరు అంటున్నారు. అంతవరకూ కన్ ఫర్మ్. దాంతోనే మంత్రి గారు అక్కడ గడప గడపకూ ప్రోగ్రాం లో పెద్దగా ఆసక్తిని చూపించడంలేదు అంటున్నారు. ఆయన తన మంత్రిత్వ శాఖ పనులు అధికారిక కార్యక్రమాలలోనే పాలుపంచుకుంటున్నారు అని తెలుస్తోంది.
అయితే యువ నేతగా దూకుడు కలిగిన మంత్రిగా జగన్ కి సన్నిహితుడుగా గుడివాడకు అధినాయకత్వం టికెట్ కచ్చితంగా ఇస్తుంది. దాని కోసం ఆయన చేయాల్సింది ఉమ్మడి విశాఖ మొత్తం మీద ఎక్కడో ఒక చోట తన సీటుని ముందే చూసుకుని అక్కడ గడప తొక్కి జనాలకు చేరువ కావడం. కానీ ప్రాక్టికల్ గా చూస్తే అది సాధ్యపడడంలేదు. దాంతో ఏ గడప తొక్కేది బాస్ అన్నట్లుగా గుడివాడ వ్యవహారం ఉంది అంటున్నారు.
ఇక గుడివాడ ప్రస్తుతానికి అనకాపల్లి గడపనే తొక్కాలని ఆయన కాకపోయినా మరొకరు అయినా అక్కడ గెలుస్తారు కాబట్టి టోటల్ గా పార్టీకే అది ఉపయోగపడుతుందని, అలాగే గుడివాడకు రేపటి ఎన్నికల్లో వేరే చోట టికెట్ ఇచ్చినా అక్కడ కూడా ప్రస్తుతం పార్టీ ఎమ్మెల్యేలు గడప తొక్కుతారు కాబట్టి రేపటి వేళ గుడివాడకు అది కలసి వస్తుందని అంటున్నారు. కానీ అనకాపల్లిలో వర్గ పోరు ఉంది.
పైగా గుడివాడకు కొందరుతో పడదు, ఆయనతో మరికొందరుకి పడదు, దాంతో ఆయన కూడా అనకాపల్లి మీద ఆశలు వదిలేసుకున్నారని అంటున్నారు. కానీ అలా ఎటూ కాకుండా అనకాపల్లిని వదిలేస్తే మాత్రం అది గుడివాడకే ఇబ్బందిగా మారుతుందని అధినాయకత్వం గుస్సా అయ్యే సీన్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి గుడివాడది అన్నీ ఉన్నా ఒక వింత సమస్యగా ఉంది. మంత్రిగా ఎంజాయ్ చేస్తున్నా వచ్చే ఎన్నికల్లో సీటు గ్యారంటీ ఉన్నా నియోజకవర్గం తేలడం లేదు. తన గడప ఏంటి అన్నది అసలు తెలియడం లేదు అని అంటున్నారు అంతా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.