Begin typing your search above and press return to search.
అధిష్టానంతో అమీతుమీ.. వైసీపీ రెడ్డి ఎమ్మెల్యే ఫైర్!
By: Tupaki Desk | 26 Dec 2022 2:52 PM GMTఅధిష్టానంపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తి, అసహనంతో అనేక మంది రెడ్డి సామాజిక వర్గం నాయకులు రగిలిపోతున్నారు. వీరిలో చాలా మంది మంత్రి పదవులు ఆశించిన వారే. అయితే.. వారికి జగన్ మొండి చేయి చూపించారు. అయితే.. వారు మాత్రం తాము.. వైసీపీకి అన్ని విధాలా అండగా ఉన్నామని.. ఆది నుంచి కూడా సీఎం జగన్‌ను సమర్ధించామని.. పాదయాత్రలో ఎంతో ఖర్చు చేశామని చెబుతున్నారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమను పక్కన పెట్టి జూనియర్లకు పదవులు ఇచ్చారనేది వీరి వాదన.
ఇలాంటి వారిలో అందరికన్నా నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒకరు. ఈయనకు మంత్రి పదవి వస్తుందని.. ఆయన అనుచరులు పెద్ద ఎత్తున హంగామా చేసేందుకురెడీ అయ్యారు. అయితే.. ఆయనకు పదవి రాలేదు. దీంతో కోటంరెడ్డి తీవ్రస్థాయిలో అసహనం.. ఆగ్రహం కలగలిపి వ్యక్తీకరించారు. కన్నీరు కూడాపెట్టుకున్నారు. ఇక, అప్పటి నుంచి ఆయన అధిష్టానం వైఖరిపై తీవ్ర స్థాయిలో పరోక్షంగా మండిపడుతున్నారు. ఇటీవల మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలోనే నియోజకవర్గంలో ఒక్క పనికూడా చేయడం లేదని.. ఇలా అయితే.. మొహం ఎలా ఎత్తుకుంటామని ప్రశ్నించారు.
ఇక, ఇప్పుడు తాజాగా ప్రబుత్వం పింఛన్లను రద్దు చేయడంపై మరింత ఘాటుగానే వ్యాఖ్యానించారు. ``ఎన్నికలకు ముందు.. అందరికీ పింఛన్లు ఇస్తామని (అర్హులైన వారికి) వాగ్దానం చేశాం. ఎప్పటి నుంచో తీసుకుంటున్న వారికి ఇప్పుడు మా ప్రభుత్వంరద్దు చేస్తోంది. ఇది న్యాయం ఎలా అవుతుంది?`` అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. అంతేకాదు.. అధిష్టానంపై విరుచుకుపడ్డారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2,700 సామాజిక పింఛన్ల తొలగింపు నోటీసులు తనను తీవ్రంగా బాధించాయని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆక్రోశం వెళ్లబుచ్చారు. పింఛన్ల తొలగింపుపై రెండురోజులుగా లబ్ధిదారులు తన కార్యాలయానికి వస్తున్నారని చెప్పారు. పాత పింఛన్ ఒక్కటీ తీసేయడానికి వీల్లేదని అధిష్టానానికి తేల్చి చెబుతున్నట్టు ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఒకసారి పింఛన్ తీసేస్తే మళ్లీ పునరుద్ధరించడం కష్టమని అన్నారు. రేపు వాళ్లు మన ఓట్లు తీసేస్తే ఏం చేద్దామని అధిష్టానాన్ని ప్రశ్నించారు. దీంతో ఆయన అధిష్టానంతో అమీతుమీకి రెడీ అయ్యారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.