Begin typing your search above and press return to search.
గోదావరి మంత్రులకు కోళ్ల సెగ.. ఏం జరుగుతోందంటే...!
By: Tupaki Desk | 14 Jan 2023 2:30 AM GMTఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి కీలకమైన నలుగురు మంత్రులు ఉన్నారు. అయితే..ఇప్పటి వరకు వారు ఎలాంటి చిక్కులూ లేకుండానే ముందుకు సాగారు. అయితే.. తాజాగా సంక్రాంతి సంబరాలు తెరమీదికి రావడంతో వారంతా చిక్కుల్లో పడ్డారు. తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, చెల్లిబోయిన వేణు, కారు మూరి నాగేశ్వరరాలు ఉభయ గోదావరి జిల్లాలకుచెందిన మంత్రులుగా ఉన్నారు.
అయితే..ఇప్పుడు వీరి చుట్టూ పార్టీ నాయకులు ప్రదక్షిణలు చేస్తున్నారు. సంక్రాంతి వచ్చింది .. బరులు వేసుకుంటున్నాం..పోలీసులు రాకుండా చూడాలని వారు మొర పెట్టుకుంటున్నారు. అయితే.. ఈ విషయంలో మంత్రులు ఎలాంటి స్పందనా లేకుండా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే.. తాము ఉన్నామని చెబితే.. ప్రతిపక్షాలు రేపు ఏకేస్తాయి. అప్పుడు సమాధానం చెప్పుకోవాలని బాధపడుతున్నారు.
పోనీ.. అలాగని వదిలేస్తే.. ఎన్నికలకు ముందు.. కేడర్ ఎక్కడ అసంతృప్తి ఫీలవుతుందో అని బాధ వారిని వేధిస్తోంది. దీంతో మంత్రులు ఎవరికి నచ్చిన రీతిలో వారు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. మంత్రి వనిత.. సీఎంతో మాట్లాడతానని చెప్పి తప్పించుకున్నారట. అయితే తాజాగా ఆమె గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్న చోటకు ఓ పది మంది కీలక నేతలు వచ్చి ఏం చేశారని అడగడంతో సీఎం బిజీగా ఉన్నారని చెప్పి దాటవేశారట.
ఇక, చెల్లుబోయిన ఏకంగా.. మంత్రి అందుబాటులోలేరని.. బోర్డు పెట్టించేశారట. కొట్టు సత్యనారాయణ మీరు వేసుకోండి నేను చూసుకుంటా! అని ధైర్యం ఇచ్చారట కానీ, మరోవైపు.. పోలీసులు మాత్రం హెచ్చరికలు జారీ చేసినా.. ఆయన మాత్రం మౌనంగా నే ఉన్నారట. ఇక, కారుమూరి మాత్రం నాకు సంబంధం లేదని తెగేసి చెప్పేందుకు రెడీ అవుతున్నారట. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో.. వైసీపీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం ఏం జరిగితే.. అదే జరుగుతుందని బరులు రెడీ చేసుకుంటున్నారట. ఇదీ.. సంగతి!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.