Begin typing your search above and press return to search.
మాజీ మంత్రి ఇలాకాలో టీడీపీ దూకుడు... వైసీపీ బేజారేనా...!
By: Tupaki Desk | 4 Dec 2022 1:30 PM GMTఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ పుంజుకుందా? ఇక్కడ మాజీ మంత్రి అమర్నాథరెడ్డి దూకుడు పెరిగిందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి గత ఎన్నికలకు ముందు 2014లో ఆయన వైసీపీ తరఫున గెలిచి.. టీడీపీలో చేరారు. దీంతో 2019లో ఆయనను ఇక్కడి ప్రజలు ఓడించారు. అయితే, ఇప్పుడు మాత్రం అమర్నాథరెడ్డి గ్రాఫ్ పెరుగుతోంది.
పార్టీ అధినేత చంద్రబాబు చెప్పిన ప్రతి పనినీ ఆయన చేస్తున్నారు. పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతున్నారు. అదేసమయంలో వైసీపీ ఎమ్మెల్యే వెంకట గౌడ్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ.. ప్రజల మధ్య కు వెళ్తున్నారు. ఇక, వెంకట గౌడ మాత్రం ఊరుకుంటారా? ఆయన కూడా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. గడప గడపకు కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు.
కానీ, ఎటొచ్చీ.. వెంకట గౌడ మాట తీరు.. కొట్టినట్టు ఉండడంతో ఆయన ప్రజలకు కనెక్ట్ కాలేక పోతున్నా రని వైసీపీలోని ఓ వర్గం నాయకులు చెబుతున్నారు.గత ఎన్నికల్లో కేవలం వైసీపీ జెండా, సీఎం జగన్ కార్డుతోనే ఈయన గెలుపు గుర్రం ఎక్కారని, కానీ, ఇప్పుడు సొంతంగా పట్టుమని వెయ్యి ఓట్లు సంపాయిం చుకున్నా.. ఓకేనని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు.. గతంలో మంత్రి పెద్దిరెడ్డికి.. ఈయన కు మధ్య మంచి అనుబంధం ఉండేది.
అయితే, రానురాను పార్టీ నేతల నుంచి ఎమ్మెల్యేపై పెరుగుతున్న ఫిర్యాదులను పరిష్కరించలేక.. మంత్రి పెద్దిరెడ్డి వెంకటగౌడను పక్కన పెట్టినట్టు ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. అయితే, దీనిలో ఎంత నిజం ఉందనేది తెలియదుకానీ, ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆయన పార్టీకి చెందిన నాయకులే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఆయన అగ్రెసివ్ కామెంట్లను ప్రచారం చేయడంతో ప్రజల్లో ఎమ్మెల్యే పలుచన అయ్యారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.