Begin typing your search above and press return to search.
వైఎస్సార్ లెగసీ కోసం... అన్న వదిలిన బాణం...?
By: Tupaki Desk | 3 Nov 2022 4:49 PM GMTరాజకీయాల్లో బంధాలకు తావు ఉండదు. అది ఎన్నో సార్లు రుజువు అయింది. ఇపుడు అది వైఎస్సార్ కుటుంబం సాక్షిగా మరో మారు రుజువు కాబోతోంది అని అంటున్నారు. ఇప్పటికి దాదాపు పదేళ్ల క్రితం తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ఏకంగా ఒక మహిళ ఉమ్మడి ఏపీలో రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. అందరూ అది చూసి ఆశ్చర్యపోయారు. ఆమె పోరాట పటిమకు, ఆమెకు అన్న మీద ఉన్న అమితమైన అభిమానానికి అంతా జోహార్ అని అన్నారు. వైఎస్సార్ పార్టీకి చెందిన కార్యకర్తలకు ఆమె అపురూపమైన చెల్లిగా మిగిలిపోయారు. జగన్ నాడు జైలులో ఉన్న సమయంలో చెల్లెలు వైఎస్ షర్మిల చేసిన పాదయాత్ర నిజంగా వైసీపీకి ఊపిరిపోసింది అనే చెప్పాలి.
జగన్ని జైలుకు పంపించి పార్టీని కకావికలు చేయాలనుకున్న ప్రత్యర్ధుల ఎత్తులు పారకుండా షర్మిల సడెన్ ఎంట్రీ ఇచ్చి అటు వైసీపీకి కొత్త బలన్ని అందించారు. అదే టైం లో ప్రత్యర్ధులకు సింహ స్వప్నంగా మిగిలారు. ఆ తరువాత కూడా ఆమె తన అవసరం పడినపుడల్లా పార్టీ కోసం ముందుకు వచ్చి సేవ చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల ముందు ఆమె బై బై బాబు అంటూ ఇచ్చిన స్లోగన్స్ హైలెట్ అయ్యాయి. ఆమె ఎక్కడ ప్రసంగాలు చేసినా అక్కడ నేల ఈనిందా అన్నట్లుగా జనాలు వచ్చారు.
అలా షర్మిల వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు అనే చెప్పాలి. అటువంటి ఆమె తరువాత మాత్రం పార్టీలో యాక్టివ్ గా కనిపించలేదు. దాని మీద రకరకాలైన ప్రచారం సాగినా ఆమెకు అధికారంలో ఎక్కడా అవకాశం లేకపోవడమే అసంతృప్తికి కారణం అని కూడా గుసగుసలు వినిపించాయి. మొత్తానికి షర్మిల తన రాజకీయ పంధాను వేరేగా ఎంచుకున్నారు. 2021లో ఆమె తెలంగాణా వైసీపీని స్థాపించి నాటి నుంచి అక్కడ రాజకీయాలు చేస్తూ వస్తున్నారు.
అయితే తెలంగాణా గడ్డ మీద తన రాజకీయం పండదని ఆమె తెలుసుకునేసరికి ఏణ్ణర్ధం గడచిపోయింది. ఇపుడు ఆమె రాజకీయం చేయాలంటే ఏపీ నుంచే చేయాలి. మరి ఏపీలో వైసీపీ ఉంది. దాంతో షర్మిల ఏకంగా అన్నతో యుద్ధానికే సిద్ధం అని సంకేతాలు ఇస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆ మధ్య విజయవాడలోని ఎన్టీయార్ వర్శిటీ పేరుని వైఎస్సార్ వర్శిటీగా మారుస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని షర్మిల తప్పుపట్టారు. ఇదే సందర్భంలో ఆమె చేసిన కామెంట్స్ కీలకమనే చెప్పాలి.
వైఎస్సార్ మీద తన కంటే అభిమానం ఉన్న వారు ఎవరూ ఉండబోరు అని ఆమె నాడు మీడియా ముందు కామెంట్స్ చేశారు. ఆ విధంగా వైఎస్సార్ ని తన సొంతం చేసుకునే ప్రయత్నం చేసినట్లుగా అర్ధమవుతుంది. ఆ తరువాత మరో స్టెప్ ముందుకు జరిగింది వ్యవహారం. ఆమె ఏకంగా ఢిల్లీకి వెళ్ళి సీబీఐకి మాజీ మంత్రి తన సొంత బాబాయ్ వివేకా దారుణ హత్య కేసుకు సంబంధించి సంచలన వాంగ్మూలం ఇవ్వడం ఇపుడు ఏపీ తో పాటు తెలంగాణాలోనూ విపరీతమైన చర్చకు దారి తీసింది.
ఆమె ఇచ్చిన వాంగ్మూలం చూస్తే విపక్షాలకు అది ఆయుధంగా మారుతోంది. చంద్రబాబు లాంటి వారు అయితే ఏకంగా ముఖ్యమంత్రి సోదరి షర్మిల చెప్పిన తరువాత కూడా బాబాయ్ హత్య విషయంలో జగన్ ఏమి చెబుతారు అంటూ మీడియా ముందే రెట్టించారు. ఇక షర్మిల అక్టోబర్ 7న ఢిల్లీకి ప్రత్యేకంగా వెళ్ళి మరీ ఈ వాంగ్మూలం ఇవ్వడమే కాదు అదే నెల 21న మరోసారి ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడుతూ సునీతకు న్యాయం జరగాలని గట్టిగా కోరుకున్నారు.
ఈ విధంగా చెప్పడం ద్వారా హత్య వెనక ఉన్న నిందితులు అందరూ బయటపడాలని ఆమె భావిస్తున్నారు. అయితే ఈ కేసులో తవ్వి తీసుకుంటూ పోతే అసలు దోషులు ఎవరైనా ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ట్రబుల్స్ లో పడుతుంది అనే అంటున్నారు. మూడున్నరేళ్ళుగా ఈ కేసు అతీ గతీ లేకుండా పోవడమే కాకుండా, నాటి సీఐ శంకరయ్యకు ప్రమోషన్ ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు అని చంద్రబాబు ప్రశ్నించడం వంటివి చూస్తే బదనాం అయ్యేది వైసీపీ సర్కార్ అని అర్ధమవుతోంది.
ఈ కేసులో సీబీఐ ఏమి తేలుస్తుంది, అసలు దోషులు ఎవరు అనంది ఎవరో దర్యాప్తు సమస్థ తేల్చే వ్యవహారం అయినా షర్మిల మాత్రం బాబాయ్ హత్య కేసులో తన దాయాది కుటుంబం అయిన వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డిల ప్రమేయం ఉందని వామంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కడప ఎంపీ టికెట్ కోసం మా బాబాయ్ వివేకా గట్టి పోటీదారుగా ఉన్నారు. వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వివేకా ఎంపీగా పోటీకి దిగితే తమ ఉనికికి ఇబ్బంది అని అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డే ఆయనను చంపించారని మాకున్న సమాచారం అని షర్మిల చెప్పారు. మరి అవినాష్ రెడ్డి అంటే కడప ఎంపీ, ఈ కేసులో ఆయన వైపు షర్మిల వేలు చూపించడం ద్వారా సొంత అన్ననే ఇరుకున పెట్టారని అంటున్నారు. మొత్తానికి చూస్తే తనకు తండ్రి వైఎస్సార్, ఆ తరువాత బాబాయ్ వివేకానందరెడ్డి అత్యంత ఇష్టులు వారిని తన కంటే ఎవరూ అభిమానించలేరు అని షర్మిల చెప్పినట్లు అయింది.
మరి ఒకనాడు అన్న వదిలిన బాణంగా రాజకీయ అరంగేట్రం చేసిన షర్మిల ఇపుడు అదే అన్న ప్రభుత్వం ఇబ్బందులో పడుతుందని తెలిసి కూడా ఇలా చేస్తున్నారు అంటే కచ్చితంగా ఆమె వైఎస్సార్ పొలిటికల్ లెగసీని కోరుకుంటున్నారు అని అర్ధమవుతోంది అంటున్నారు. ఏపీలో వైసీపీ అన్నది ఇబ్బందులలో పడితే అది షర్మిలకు రాజకీయంగా లాభించే అంశం అవుతుందా అన్న చర్చ కూడా ఇపుడు ముందుకు వస్తోంది. ఏది ఏమైనా ఒకనాడు అన్న వదిలిన బాణం ఇపుడు అదే అన్నకు గుచ్చుకుంటోంది అని అంటున్నారు. అలా చూసుకుంటే అటూ ఇటూ తిరిగిన షర్మిల రాజకీయం ఇపుడు ఏపీ వైపు పదునైన బాణంగా దూసుకువస్తోంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.