Begin typing your search above and press return to search.
కరోనా మీద పద్మశ్రీ వచ్చిన పెద్దాయన తప్పు చెప్పారా?
By: Tupaki Desk | 25 March 2020 12:30 AM GMTకరోనా వేళ.. పాలపాకెట్లు.. వార్తా పత్రికల కారణంగా కరోనా వైరస్ ముప్పు ఉందన్న మాట ఇటీవల కాలంలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన కొందరు వైద్యులు చెప్పే సలహాలు.. సూచనలతో కూడిన వీడియోలు భారీ ఎత్తున షేర్ అవుతున్నాయి. దీంతో.. రోజువారీగా దినపత్రికల్ని కొనుగోలు చేసే వారు.. ఇంటికి తెప్పించుకునేటోళ్లు.. న్యూస్ పేపర్లను ముట్టుకునే విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
అనుమానం ఉన్నోళ్లు.. ఎక్కువ అప్రమత్తంగా ఉన్నోళ్లు వార్తాపత్రికలు తమ ఇళ్లకు కొన్నాళ్లు వేయొద్దని తేల్చేస్తే.. మరికొందరు మాత్రం భరోసాతో వినియోగిస్తున్నరు. ఇలాంటివేళ.. ఒక ప్రముఖ మీడియాలో వచ్చిన ఒక వార్త ఇప్పుడు ఆశ్చర్యంతో పాటు.. కొత్త చర్చకు తెర తీసేలా మారింది. వార్తా పత్రికలతో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని అసోంకు చెందిన ప్రముఖ వైద్యులు.. పద్మశ్రీ పురస్కారం పొందిన పెద్దాయన డాక్టర్ ఇలియాన్ అలీ స్పష్టం చేసినట్లుగా అచ్చేశారు.
ఇంతకీ ఆయన వినిపించిన వాదనను చూస్తే.. ‘‘కరోనా వైరస్ చేరువుగా వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఇన్ ఫెక్షన్ సోకుతుంది. దీంతో.. ఇతరులకు కనీసం మీటరు దూరం పాటించాలి. ఇతర వైరస్ లతో పోలిస్తే కరోనా బరువు ఎక్కువ. రోగి తమ్మినప్పుడు అది మీటరుకన్నా దూరం వెళ్లలేదు. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇటలీ అనునభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి..’’ అంటూ తెలిసిన విషయాల్నే మళ్లీ చెప్పారే తప్పించి.. వార్తా పత్రికల కారణంగా ముప్పు ఎలా లేదన్న శాస్త్రీయ వాదనను వినిపించలేదు.
నిజాన్ని నిజంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు.. ప్రజలకు వాస్తవాల్ని చేరవేయాల్సిన బాధ్యత పాత్రికేయుల మీద ఉంటుంది. ఒకవేళ నిజం చెప్పే ఆలోచన లేనప్పుడు.. దాన్ని ప్రస్తావించకుండా మౌనంగా ఉండాలే కానీ.. అబద్ధం మాత్రం చెప్పకూడదు. వార్తా పత్రికలతో కరోనా వ్యాపించదని.. అసోం ఆరోగ్య.. ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ అనే పెద్దాయన కూడా క్లారిఫై చేశారంటూ.. ఆ మాటల్ని తెలుగోళ్లకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ మర్చిపోకూడని విషయం ఏమంటే.. అసోం రాష్ట్రంలో పత్రికల సర్య్కులేషన్ కు.. తెలుగు రాష్ట్రాల్లో దినపత్రికలు (అది ఏ భాష అయినా కానీ) వినియోగించే వారికి సంబంధం లేదు.
వంద మందిలో మన దగ్గర పదిహేను మంది వాడితే.. అసోం లాంటి రాష్ట్రంలో వందకు ఒకరు కూడా వాడని పరిస్థితి. అలాంటి వేళ.. ముప్పు ఎక్కడ ఎక్కువగా ఉంటుందన్నది అసలు ప్రశ్న. ఇక.. వాస్తవంలోకి వెళదాం. నిజం నీకెలా తెలుసు? నువ్వు ఏమైనా నిపుణుడివా? అని ప్రశ్నించొచ్చు. నిజమే.. దీన్ని రాస్తున్న వ్యక్తి వైద్యుడు.. వైద్య శాస్త్రానికి సంబంధించిన అంశాల మీద పట్టు ఉన్న వ్యక్తి కాదు. అవగాహన కూడా అంతంతే. కానీ.. గూగులమ్మ పుణ్యమా అని.. ఏది నిజం? ఏది అబద్ధమన్న విషయాన్ని గుర్తించే అవగాహనతోపాటు.. తర్కంతో ఆలోచించే అలవాటు ఎక్కువగా ఉంది.
వార్తాపత్రికల మీద కరోనా వైరస్ ఎంతకాలం మనగలదు? అన్నది గూగుల్ లో సెర్చ్ చేస్తే.. వచ్చే సమాధానం 24 గంటలు అని. అంతేకాదు.. వార్తాపత్రిక ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. 32 డిగ్రీల సెల్సియస్ వద్ద చనిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇంతకీ పేపర్ ద్వారా కరోనా వైరస్ ఎలా వస్తుందంటే.. ప్రింటింగ్ స్టేషన్ లో ఆరోగ్యకర వాతావరణంలో పేపర్ తయారు చేయొచ్చు. దాన్ని బండిల్స్ కూడా జాగ్రత్తగానే కట్టి ప్యాక్ చేసి ఏజెంట్ వద్దకు పంపొచ్చు. అక్కడి నుంచి మన ఇంటికి వచ్చే క్రమంలో వైరస్ దాని మీద కూర్చునే ప్రమాదం పొంచి ఉందన్నది మర్చిపోకూడదు.
ఎందుకంటే.. బండిల్స్ గా వచ్చిన పేపర్లను ఏజెంట్.. హైదరాబాద్ లో అయితే హోల్ సేలర్ ఆ బండిల్ విప్పదీసి.. ఇస్తారు. దాన్ని ఆర్డర్ లో పెట్టుకొని.. ఇంటింటికి పేపర్లు వేసే వారు ఉంటారు కదా? వారు తమ పని చేసే సమయంలో దగ్గినా.. తుమ్మినా కరోనా వైరస్ న్యూస్ పేపర్ల మీద తిష్ట వేసే అవకాశం ఉంది. అయితే.. ఈ ప్రమాదం ఎంత అంటే? తక్కువే ఉండొచ్చు. కానీ.. ప్రమాదం ఏ వైపు నుంచి ఎంత తక్కువగా వస్తున్నా.. దాన్ని తమ వరకూ రాకుండా నిరోధించటం చాలా అవసరం కదా? అన్నది ప్రశ్న. ఈ తర్కంతో చూసినప్పుడు వార్తా పత్రికలతో వైరస్ వచ్చే ప్రమాదం పొంచి ఉందన్నది సత్యం. అయితే.. దాని తీవ్రత ఎంతన్నది చెప్పలేం. అలాంటి పరిస్థితుల్లో పద్మశ్రీ పురస్కారం పొందిన డాక్టర్ పెద్దాయన చెప్పిన మాటల్ని.. వెనుకా ముందు ఆలోచించకుండా అచ్చేయటం ఎంతవరకు సబబు అంటారు?