Begin typing your search above and press return to search.

సడెన్ స్ట్రోక్ : అల్లా అంటే ఎల్లా గల్లా అరుణమ్మా...?

By:  Tupaki Desk   |   24 Jun 2022 2:30 AM GMT
సడెన్ స్ట్రోక్ : అల్లా అంటే ఎల్లా గల్లా అరుణమ్మా...?
X
తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబుకు సొంత జిల్లా చిత్తూరులోని బలమైన రాజకీయ కుటుంబం నుంచే భారీ స్ట్రోక్ తగిలిందా అంటే జవాబు అవును అనే వస్తోంది. అన్నది ఎవరో కాదు సీనియర్ మోస్ట్ లీడర్ మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారి.

ఆమె రాజకీయ జీవితం చాలా సుదీర్ఘమైనది. చిత్తూరు జిల్లాలో ఆమె చంద్రగిరి నుంచి గెలుస్తూ వచ్చారు. ఇక ఆమె రాజకీయ వారసత్వం తండ్రి పాటూరి రాజగోపాలనాయుడు నుంచి వచ్చింది. ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్.

ఇక అరుణకుమారి కాంగ్రెస్ లో చేరి కీలక మంత్రిత్వ శాఖలకు పనిచేశారు. ఇక 2014లో టీడీపీలో చేరి చంద్రగిరి నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉంటూ వచ్చారు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి ఎంపీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిత్తూరు జిల్లాలోని అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా గల్లా అరుణ బాంబు లాంటి వార్తనే పేల్చారు.

తన రాజకీయ జీవితం ముగిసింది అని పక్కా క్లారిటీగా చెప్పేశారు. తాను ఇక మీదట రాజకీయాల్లో ఉండబోను అని ఒక్క ముక్కలో తేల్చేశారు. నేను చేయని రాజకీయం లేదు, చూడని పదవి లేదు అని కూడా గల్లా చెప్పేశారు. ఇక తన అనుచరులుగా ఉన్న వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాను అని కూడా పేర్కొన్నారు. వారు నచ్చిన పార్టీలోకి వెళ్ళిపోవచ్చు అని ఆమె చెప్పడం విశేషం.

ఇక టీడీపీకి పెద్ద దిక్కు చంద్రబాబునాయుడే అంటూ ఆమె అన్న మాటల వెనక అర్ధాలు పరమార్ధాలు ఏంటి అన్న చర్చ కూడా నడుస్తోంది. టీడీపీకి తాము పెద్ద దిక్కు కానే కాము అని ఆమె అనడం వెనక స్వరం ఏమై ఉంటుంది అన్న దాని మీద అంతా ఆలోచిస్తున్నారు. నాకొద్దీ రాజకీయాలు నేను ఫుల్ సైలెంట్ అని గల్లా అరుణమ్మ చెప్పేశారు. డెబ్బై ఏడేళ్ల వయసు ఉన్న గల్లా అరుణ రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుంటే ఆమె వారసులు ఎవరైనా చంద్రగిరిలోకి దిగవచ్చు.

దశాబ్దాల తరబడి కాపాడుకున్న రాజకీయం అది. కానీ అరుణమ్మ అయితే రాజకీయాలకు స్వస్తి అంటున్నారు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ కూడా టీడీపీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. దీన్ని బట్టి చూస్తే గల్లా ఫ్యామిలీ ఏకంగా సైకిల్ దిగిపోతుందా అన్న డౌట్లు వస్తున్నాయి. అంత పెద్ద రాజకీయ కుటుంబం పార్టీని వీడితే అది టీడీపీకి భారీ షాక్ గానే చూడాలి. మరి దాని మీద టీడీపీ ఏమంటుంది అన్నది కూడా ఆలోచించాలి.