Begin typing your search above and press return to search.

ప్లీన‌రీ టైమ్ : అదే క‌ల..అవే క‌ళ్లు.. ఆ మ‌నిషి మార‌డు !

By:  Tupaki Desk   |   27 April 2022 3:30 PM GMT
ప్లీన‌రీ టైమ్ : అదే క‌ల..అవే క‌ళ్లు.. ఆ మ‌నిషి మార‌డు !
X
గ‌డుసు పోర‌డు అని అనుకునేందుకు కేసీఆర్ లాంటి వారిని చూసి నిర్ణ‌యించుకుని పైకి అనాలి. కానీ కేసీఆర్ గ‌డుసు పోర‌డు అవునో కాదో తెలియ‌దు. కానీ ఆ విధంగా కొన్ని సార్లు ఉన్నారాయ‌న. వీలున్నంత వ‌ర‌కూ తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు త‌న వంతు కృషి చేస్తాన‌ని చెప్పి, ఆ మాట నిల‌బెట్టుకున్నారు. సాధ‌న ఫ‌లాల‌ను ఇవాళ తెలంగాణ రాష్ట్ర స‌మితి ఒక్క‌టే అనుభ‌వించ‌డం కాంగ్రెస్ కు గిట్టుబాటు కానీ విష‌యం.

ఇంకా చెప్పాలంటే మింగుడు ప‌డ‌ని విష‌యం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని ప‌దే ప‌దే చెప్పే కాంగ్రెస్ ను ఆ ప్రాంతంలో న‌మ్మ‌డం లేదు. ఇవాల్సిన‌ది ఎవ‌రు ఇచ్చిందెవ‌రు.. తెచ్చింది ఎవ‌రు.. సాకార దిశ‌గా అడుగులు వేసి ప్రాణాల‌ను సైతం అడ్డు పెట్టిందెవ‌రు అని కొన్ని వేల సార్లు చాలా మంది ప్ర‌శ్నించినా, అమ‌రుల త్యాగాల‌ను టీఆర్ఎస్ విస్మ‌రిస్తోంది అన్న వాద‌న‌లు వ‌చ్చినా ఎక్క‌డా కూడా ఆ పార్టీ ఓటు బ్యాంకు పెద్ద‌గా చెక్కు చెద‌ర‌లేదు. 21 ఏళ్ల ప్రయాణంలో ఓ పార్టీ ఏం నేర్చుకుంది ఎలా ఒదిగిపోయింది.. ఎలా ఎదిగి వ‌చ్చింది అన్న‌వి ఇవాళ చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

ఎలా చూసుకున్నా గురువు చంద్ర‌బాబును మించిపోయాడు కేసీఆర్. త‌న‌కు రాజ‌కీయ జీవితం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి ఇవాళ అక్క‌డ నామ‌రూపాలు లేవు. పోనీ చంద్ర‌బాబు ఇప్పుడు వెళ్లి పార్టీని చ‌క్క‌దిద్దుమా అంటే కుద‌ర‌ని ప‌ని.

అంత‌కుమించిన ప‌నులు అతి చిన్న రాష్ట్రంలో కూడా నెగ్గుకు రాలేని ప‌నులు ఆయ‌న‌కు ఆంధ్రావ‌నిలో ఉన్నాయి. క‌నుక తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉప ప్రాంతీయ పార్టీగా ఉండిపోయింది. ఇదే స‌మ‌యంలో మ‌రో టైటిల్ ను తెర‌పైకి తెచ్చి జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో రాణించాల‌ని కేసీఆర్ ఎంచుకుంటున్న ఓ వ్యూహం అని తెలుస్తోంది.

అందుకే ఆయ‌న త‌రుచూ ఆంధ్రా ప‌రిణామాల‌పై మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ద‌క్షిణాదిలో ఇప్ప‌టికిప్పుడు కేసీఆర్ మాట వినే నాయ‌కుల్లో జ‌గ‌న్ ఒక్క‌రే ముందు వ‌రుస‌లో ఉంటారు.

అయితే ఆయ‌న విన్నా కూడా కేసీఆర్ మాట‌ను ఆచ‌ర‌ణ రూపంలోకి తెస్తారా లేదా అన్న‌ది చెప్ప‌లేం క‌నుక కేసీఆర్ కు ఉన్న ఏకైక క‌ల (ప్ర‌ధాని కావాల‌న్న క‌ల‌) ఎప్ప‌టిక‌ప్పుడు ఊరిస్తూ ఊరిస్తూ ఉంది.