Begin typing your search above and press return to search.
జగన్ బిగ్ సౌండ్ అక్కడేనా... ?
By: Tupaki Desk | 21 April 2022 10:29 AM GMTఏపీలో చూస్తే విపక్షాలు ఒక్కసారిగా గొంతు పెంచుతున్నాయి. వారూ వీరూ అని తేడా లేకుండా అన్ని పార్టీలు వైసీపీ మీదనే కత్తులు దూస్తున్నాయి. ఇక చంద్రబాబు అయితే ఫుల్ జోష్ మీద పుట్టిన రోజు పూటా జగన్ మీద గట్టిగానే మాట్లాడారు. తండ్రి వైఎస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ నాడే బాగా సంపాదించారని కామెంట్స్ చేశారు. ఇక ఏపీలో అవినీతి పెద్ద ఎత్తున సాగుతోందని ఆయన ఆరోపించారు.
మరి దీనికి జగన్ వైపు నుంచి పెద్దగా ఆన్సర్ లేదు. మంత్రులు కూడా రియాక్ట్ అయినది లేదు. అయితే కచ్చితంగా జగన్ ఈ మాటలకు సరైన రిటార్ట్ ఇస్తారని అంటున్నారు. ఈ మధ్యన నంద్యాల సభలో జగన్ నా వెంట్రుక ఎవరూ పీకలేరు అంటూ ఇచ్చిన కౌంటర్ కి విపక్షాలు బాగానే ఇబ్బంది పడ్డాయి.
ఇపుడు కూడా అలాంటి పంచులు, రిటార్టులు, కౌంటర్లు బోలెడు జగన్ నుంచి ఆశించవచ్చు. జగన్ ఈ నెల 23న ఒంగోలు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఆ తరువాత ఈ నెల 28న ఆయన విశఖ జిల్లా పర్యటన చేపడుతున్నారు. రానున్న రోజుల్లో జగన్ జిల్లా టూర్లు వరసగా మొదలవుతాయి. ఈ నేపధ్యంలో జగన్ ఏదో ఒక సభలో విపక్షాల మీద బిగ్ సౌండ్ చేస్తారు అని అంటున్నారు.
ఇన్నాళ్ళూ విపక్షాలు ఏమన్నా కూడా జగన్ నుంచి పెద్దగా రియాక్షన్ వచ్చేది కాదు, కానీ ఇపుడు వచ్చేవి ఎన్నికలు కాబట్టి జగన్ కూడా గట్టిగానే ఉండదలచుకున్నారు అని అంటున్నారు. దాంతో పాటు సీఎం హోదాలో జగన్ రియాక్షన్ ఎపుడూ హైలెట్ గానే ఉంటుంది. దాని మీద మీడియాలో బోలెడు డిబేట్లు కూడా జరుగుతాయి. ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరుగుతుంది.
దాంతో జగన్ సభలు అంటేనే ఇపుడు మీడియా సహా అంతా ఆసక్తిగా చూసే పరిస్థితి ఉంది. ఇంకో వైపు చూస్తే చంద్రబాబు కూడా జిల్లాల టూర్లకు రెడీ అవుతున్నారు. ప్రతీ రోజూ ఎక్కడో ఒక సభ పెట్టి ఆయన అధికార పక్షాన్ని చీల్చిచెండాడం ఖాయం.
దానికి బదులుగా జగన్ వైపు నుంచి పదునైన బాణాలే ఉంటాయని అంటున్నారు. మొత్తానికి జగన్ జిల్లాల టూర్లతో చేసే బిగ్ సౌండ్ ఏపీ పాలిటిక్స్ లో కంప్లీట్ గా కాక పుట్టిస్తుంది అని చెప్పవచ్చు అంటున్నారు.