Begin typing your search above and press return to search.
మూడు వర్గాలు...ఆరని పోరాటాలు...?
By: Tupaki Desk | 18 April 2022 9:31 AM GMTఇపుడు వైసీపీ ఒక్కటిగా కాదు, ఎన్నో వర్గాలుగా విడిపోతోంది. ఆ జబ్బు మెల్లగా కీలకమైన జిల్లాల్లో కూడా ప్రవేశిస్తోంది. నెల్లూరు వైసీపీకి కంచు కోట. జగన్ కాంగ్రెస్ ని వీడి బయటకు వచ్చినపుడు ఆయనకు అండగా ఉంటూ కాంగ్రెస్ ని వీడిన మరో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆ తరువాత ఇద్దరూ వైసీపీ గుర్తు మీద ఉప ఎన్నికల్లో గెలిచారు.
అదే విధంగా 2012లో జరిగిన అనేక ఉప ఎన్నికల్లో కూడా నెల్లూరు నుంచి వైసీపీ అభ్యర్ధులు గెలిచి గట్టిగా జెండా పాతారు. జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే అందులో ఏడు సీట్లను 2014లో వైసీపీ గెలుచుకుని తమ సత్తా చాటింది. ఇక 2019 నాటికి మొత్తానికి మొత్తం సీట్లను గెలవడం ద్వారా టీడీపీని సైడ్ చేసి పారేసింది.
మూడేళ్ళుగా అధికారంలో ఉన్న సమయంలో నెల్లూరు వైసీపీలో గ్రూపులు అలాగే నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వంటి వారు తరచూ సొంత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఒక వర్గంగా ఉన్నారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఏకపక్షంగా వెళ్లారని సీనియర్లు భావించేవారు.
ఇపుడు కాకాణి గోవర్ధనరెడ్డి వంతు వచ్చింది. ఆయన మంత్రి అయ్యారు. కీలకమైన వ్యవసాయ శాఖ చేపట్టారు. అయితే గ్రూపులు మాత్రం అలాగే ఉన్నాయి. పైగా అవి రెండు కాస్తా మూడుగా మారి కంచుకోట జిల్లాలో మూడు ముక్కలాడుతున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ సభను నిర్వహించి వర్గాలు ఉన్నాయనే సంకేతాలు పంపారు.
మరో వైపు కాకాణి వర్గంలో ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాకాణి కూడా తాను రాజకీయంగా ఇంతటివాడిని కావడానికి ఆనం, ఆదాల వంటి నేతలే కారణం అని తలచుకోవడం ద్వారా వర్గ పోరుని పెంచేలా చేశారు అంటున్నారు. మరో వైపు మాజీ మంత్రి అనిల్ వర్గంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి వారు ఉన్నారని అంటున్నారు. మూడవ వర్గం మేకపాటి వారిది. చంద్రశేఖర్ రెడ్డి, వరప్రసాద్, సంజీవయ్య ఇందులో ఉన్నారు అని తెలుస్తోంది.
దీని మీద విశ్లేషించుకుంటే నెల్లూరు వైసీపీలో కోల్డ్ వార్ అయితే సాగుతోంది అని చెప్పాలి. అదే విధంగా అంతా జగన్ వర్గమే, జగన్ కి విధేయులమే అని చెబుతున్నా ఎవరి దారి వారిది అన్నట్లుగానే కధ సాగుతోంది. మరి హై కమాండ్ వెంటనే ఈ వివాదాలకు తెర దించాలి. వర్గ పోరుకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే నెల్లూరు రచ్చలో చిత్తు అయ్యేది ఫ్యాన్ పార్టీనే అంటున్నారు.