Begin typing your search above and press return to search.
చాణక్య బోల్తాకొట్టింది...ఢిల్లీ లెక్క ఓకే..ఏపీలోనే షాక్
By: Tupaki Desk | 23 May 2019 11:15 AM GMTవైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ తొలిసారి ఏపీలో అధికార పగ్గాలు చేపట్టనుందిన మెజార్టీ సర్వే సంస్థలు అంచనాలు వేసిన సంగతి తెలిసిందే. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడయ్యాయి. లోక్ సభ స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ విజయ దుందుభి మోగించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా కట్టాయి. తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. అయితే, మిషన్ చాణక్య సర్వే ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 98 స్థానాల్లో - టీడీపీ 58 స్థానాల్లో - జనసేన పార్టీ 7 స్థానాల్లో - ఇతరులు ఒక స్థానంలో విజయం సాధిస్తారని అంచనా వేయగా ఆ లెక్కలు పూర్తిగా తప్పాయి.
జాతీయ స్థాయిలలో బీజేపీ 364 సీట్ల వరకు గెలుచుకోవచ్చని చాణక్య అంచనా వేసింది. బీజేపీ - మిత్రపక్షాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు జోస్యం చెప్పింది. అయితే, ఏపీ విషయంలో మాత్రం చాణక్య లెక్క తప్పింది. . 25 లోక్ సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 17 నుంచి 20 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేయగా...ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలో ముందంజలో లేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ దూసుకుపోతోంది.
ఇదిలాఉండగా - ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియాతో మాట్లాడిన జగన్... ప్రజలు - దేవుడు వైసీపీని ఆశీర్వదించారని తెలిపారు. ఈ విజయం తాము ఊహించిందేన్న వైఎస్ జగన్... ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదానే మా అజెండాగా ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంపై స్పందించిన ఆయన... ప్రధాని నరేండ్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.