Begin typing your search above and press return to search.
72 గంటల్లో ఏమైనా జరగొచ్చంటూ పాక్ మంత్రి వార్నింగ్
By: Tupaki Desk | 27 Feb 2019 9:55 AM GMTతాజాగా చోటు చేసుకున్న పరిణామాలు వేగంగా రెండు దాయాది దేశాల మధ్య యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకునేలా చేస్తున్నాయి. ఉగ్ర శిబిరాలపై భారత్ జరిపిన మెరుపుదాడులకు పాక్ కుతకుతలాడుతూ.. భారత్ మీద అన్యాయంగా వైమానిక దాడులు చేసే ప్రయత్నం చేసింది. అయితే.. ఈ చర్యను భారత వైమానిక దళాలు గట్టిగా తిప్పి కొట్టాయి.
అదే సమయంలో భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాల్ని కూల్చేసినట్లుగా పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది. అయితే.. ఇందులోనిజం లేదని.. ఒక విమానం మాత్రం సాంకేతిక కారణాలతో కూలినట్లుగా భారత్ చెబుతోంది. మరోవైపు ప్రపంచ దేశాలు పాక్ తీరును తప్పు పడుతున్న వేళ.. పాక్ మంత్రి మాత్రం అందుకు భిన్నంగా భారీ హెచ్చరికలు చేస్తున్నారు.
తాజాగా పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ.. రానున్న 72 గంటల్లో ఏమైనా జరగొచ్చంటూ తీవ్ర వ్యాఖ్య చేశారు. తాను చెప్పేది జాగ్రత్తగా వినాలని.. యుద్ధమా? శాంతా? అన్నది రానున్న 72 గంటల్లో తేలుతుందని.. భారత్ - పాక్ మద్య ఇదే అంతిమ యుద్ధం కావొచ్చన్నారు. ఒకవేళ యుద్ధమే జరిగితే అది రెండో ప్రపంచ యుద్ధం కంటే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
భారత్ కు తాను చాలా స్పష్టమైన.. గట్టి సందేశం ఇస్తున్నానని.. తమ దేశాన్ని నాశనం చేయాలని చూస్తే.. దారుణ పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. మేం తలుచుకుంటే మీ దేశంలో గడ్డి పరక కూడా మొలవదు. పక్షులు కిచకిచలాడవు. మీ ఆలయాల్లో గంటలు మోగవంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయటం గమనార్హం.