Begin typing your search above and press return to search.
ఏపీ టీడీపీలో వారసులు వచ్చేస్తున్నారు!
By: Tupaki Desk | 27 Sep 2018 7:47 AM GMTఏపీ రాజకీయాల్లోకి కొత్త తరం అడుగు పెట్టేందుకు హడావుడి పడుతోంది. ఏపీ అధికారపక్షం టీడీపీ నేతల కుటుంబ సభ్యులు వారసుల రూపంలో ఎన్నికల బరిలోకి అడుగు పెట్టేందుకు పడుతున్న తపన అంతా ఇంతా కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019లో జరిగే అసెంబ్లీ.. లోక్ సభ ఎన్నికల్లో తమ వారసులుగా ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమకు తాము రాజకీయాల నుంచి తప్పుకొని.. తమ స్థానంలో తమ వారసులుగా పిల్లలకు అవకాశాలు ఇవ్వాలన్న వినతులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
ఇదిలా ఉంటే.. వారసులకు సీట్లు కేటాయించే విషయంలో బాబుకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎందుకంటే.. తమ వారికి అవకాశం దక్కేలా సీనియర్లు కొందరు తమకు తాము బరిలో నుంచి తప్పుకుంటామన్న మాట చెబుతుంటే.. మరికొందరు మాత్రం తమతో పాటు.. తమ వారసులకు కూడా టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్‌ను తెర మీదకు తెస్తున్నారు.
రాజకీయ వారసులపై ప్రజల్లో అంతకంతకూ ఏవగింపు పెరుగుతున్న వేళ.. వారసులకు టికెట్లు ఇస్తే.. తుది ఫలితం కొంప ముంచటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు.. బాబు పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలకు.. టీడీపీ నేతల వారసులు ఎన్నికల బరిలోకి దిగటం ప్రతికూలంగా మారుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని చెబుతున్న టీడీపీ నేతల వారసుల వివరాలు చూస్తే..
+ కర్నూలు జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని సంకేతాలు ఇస్తున్నారు. తన బదులు తన కుమారుడు శ్యాంబాబు పోటీ చేస్తారన్న మాట తన సన్నిహితులతో చెబుతున్నారు.
+ శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని పార్టీ అధినేత చంద్రబాబుకు ముందే చెప్పి.. తన బదులు తన కుమార్తె శిరీషకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
+ అనంతపురం ఎంపీ.. సీనియర్ నేత జేసీ దివాకరరెడ్డి కూడా చంద్రబాబును కలిసి ఈసారి ఎన్నికల్లో తన బదులు కుమారుడు పవన్ రెడ్డికి అవకాశమివ్వాలని కోరారు
+ జేసీ సోదరుడు కమ్ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి కూడా తన స్థానంలో తన కుమారుడు అస్మిత్‌రెడ్డిఎన్నికల బరిలోల బరిలోకి దిగుతారంటున్నారు.
+ చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కమ్ పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి తమ్ముడి భార్య అనీషా రెడ్డిని పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఇటీవల ఖరారు చేశారు.
+ చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తాను ప్రాతినిధ్యం వహించే శ్రీకాళహస్తిలో తనకు బదులు తన కుమారుడు సుధీర్‌రెడ్డిని బరిలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు.
+ ఇదే జిల్లాకే చెందిన దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడి పెద్దకుమారుడు నగరి టికెట్ ఆశిస్తున్నారు. ముద్దు కృష్ణమ మరణం తర్వాత ఆయన కుటుంబం రెండుగా చీలటం తెలిసిందే.
+ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరాం తనకో అవకాశం ఇవ్వాలంటున్నాడు. తన తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నుంచి ఆమె బరిలోకి దిగనున్న వేళ.. తనకు వేరే స్థానం కల్పించాలంటున్నారు. కల్యాణ దుర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరి.. అధినాయకత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో?
+ మరో మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కూడా ఈసారి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. అయ్యన్న తన నియోజకవర్గం నర్సీపట్నం నుంచే మరోసారి పోటీ చేయనున్నారు. మరోచోట ఎక్కడైనా పోటీ చేయాలన్నది విజయ్ ప్రయత్నం. అనకాపల్లి ఎంపీ సీటు ఖాళీ అయితే అక్కడ తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
+ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబం నుంచి ఈసారి ఇద్దరి పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయి. మంత్రి లోకేశ్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తికి మనవడు. విశాఖ ఎంపీ సీటుకు ఆయన పేరు ప్రచారంలో ఉంది.
+ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు బదులుగా ఆయన కుమారుడు రంగారావు, రాయపాటి సోదరుడు శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. మాచర్ల, గుంటూరు-2 వంటి అసెంబ్లీ సీట్లపైనా వారు ఆశలు పెట్టుకున్నారు.
+ దివంగత సీనియర్ నేత బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్ పేరు ఏలూరు లోక్‌సభ స్థానం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
+ కృష్ణా జిల్లాకు చెందిన దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్ పేరు నూజివీడు బరిలో దిగాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
+ తూర్పు గోదావరి జిల్లా తుని స్థానంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పేరు వినిపిస్తోంది.
+ రాజమహేంద్రవరం లోక్ సభ స్థానం నుంచి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ కోడలు రూప పేరు వినిపిస్తోంది.
+ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కుమారుడు కర్నూలు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే..ఆ టికెట్ ను ఎస్వీ మోహన్ రెడ్డికి ఇస్తామని లోకేశ్ ప్రకటించిన నేపథ్యంలో ఏమవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
+ ప్రకాశం జిల్లాలో సీనియర్ నేత కరణం బలరాం తనయుడు వెంకటేశ్ కూడా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
+ కడప జిల్లాలో మాజీ మంత్రి ఖలీల్ బాషా కుమారుడు డాక్టర్ సోహైల్ కూడా రేసులో ఉన్నారు.
+ దివంగత టీడీపీ సీనియర్ నేత లాల్‌జాన్ బాషా కుటుంబ సభ్యులు కూడా ఈసారి పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు. ఆయన సోదరుడు జియావుద్దీన్, కుమారుడు గయాదుద్దీన్ గుంటూరు-1 టికెట్‌ను ఆశిస్తున్నారు.
+ కేంద్ర మాజీ మంత్రి - ఎంపీ అశోక్ గజపతిరాజు కుమార్తె పేరు ఇటీవల విజయనగరం అసెంబ్లీ సీటుకు ప్రచారంలోకి వచ్చింది. అశోక్ పోటీ చేయని పక్షంలో ఆయన కుమార్తె అదితి పేరు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది.
+ గుంటూరు జిల్లాలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాం కూడా పోటీకి ఆసక్తితో ఉన్నారు.