Begin typing your search above and press return to search.

వచ్చే ఏడాది సెలవులన్ని శని.. ఆదివారాలే

By:  Tupaki Desk   |   22 Nov 2019 4:59 AM GMT
వచ్చే ఏడాది సెలవులన్ని శని.. ఆదివారాలే
X
వర్క్ హాలిక్ అయినా.. కమిట్ మెంట్ తో పని చేసే వారైనా.. సెలవు వస్తుందంటే చాలు.. ఆ రిలీఫ్ వేరుగా ఉంటుంది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా వచ్చే సెలవుల మీద ఆసక్తి ఎక్కువ. దీనికి తోడు లాంగ్ వీకెండ్.. లాంగ్ లాంగ్ వీకెండ్లు వస్తున్నాయంటూ అందుకు తగ్గట్లు టూర్లు ప్లాన్లు చేసుకునే ట్రెండ్ ఇప్పుడు మొదలైంది.

వచ్చే ఏడాదికి చెందిన సెలవుల్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేశాయి. కొన్ని సెలవులు తప్పించి.. మిగిలిన అన్ని సెలవులు కామన్ గానే ఉంటాయి. వచ్చే ఏడాదికి సంబంధించిన సెలవుల విషయానికి వస్తే.. ఈసారి అందరికి నీరసం కలిగించే పరిస్థితి.

ఎందుకంటే.. సాధారణ సెలవుల్లో ఎక్కువ శని.. ఆదివారాలే వస్తున్న పరిస్థితి. పలుశాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఐటీ ఉద్యోగులకు సైతం శని.. ఆదివారాల్లో సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సెలవుల్లో అత్యధికం శని..ఆదివారాలు రావటంతో నీరసం వచ్చే పరిస్థితి. సెలవుల లెక్క చూస్తే.. సాధారణ సెలవులు 28 కాగా.. ఐచ్ఛిక సెలవులు 20గా లెక్క తేల్చారు.

సాధారణ సెలవుల్లో బక్రీద్.. ఆగస్టు 15, వినాయకచవితి, బతుకమ్మ, దుర్గాష్టమి, బాక్సింగ్ డే, దీపావళి (రెండో శనివారం) శనివారాల్లో రాగా.. జనవరి 26, మొహ్రరం, దసరాలు ఆదివారాలు వచ్చాయి. శుక్రవారాల్లో వచ్చే సెలవుల్ని చూస్తే.. మహా శివరాత్రి, గుడ్ ఫ్రైడే, గాంధీజయంతి, మిలాద్ - ఉన్ - నబి, క్రిస్మస్ లు వచ్చాయి. ఎక్కువ సెలవులు తమకు వచ్చే వీకెండ్స్ లో రావటం ఉద్యోగులే కాదు.. విద్యార్థులకు కూడా నిరాశ కలిగించేదే. పండుగ సెలవులు విడి సెలవు రోజుల్లో వస్తే.. అంతకు మించిన నీరసం ఇంకేం ఉంటుంది చెప్పండి.