Begin typing your search above and press return to search.

ఆ గుడిలో గంట‌లు మోగ‌కుండా కొత్త రూల్

By:  Tupaki Desk   |   14 Dec 2017 5:29 AM GMT
ఆ గుడిలో గంట‌లు మోగ‌కుండా కొత్త రూల్
X
దేవాల‌యం అన్నంత‌నే దేవుడి ద‌ర్శ‌నం.. గంట కొట్ట‌టం.. జ‌య‌జ‌య‌ధ్వానాలు చేయ‌ట‌.. హార‌తి తీసుకోవటం.. అర్చ‌కుడు మంత్రాలు చ‌ద‌వ‌టం లాంటి లిస్టు చాలానే ఉంటాయి. ఇలాంటి వాటికి చెక్ చెబుతూ జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ నిర్ణ‌యం తీసుకుంది. హిందువుల‌కు ప‌ర‌మ ప‌విత్ర‌మైన అమ‌ర్ నాథ్ ఆల‌యంలో కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల్ని విడుద‌ల చేసింది. తాజా నిర్ణ‌యంతో అమ‌ర్ నాథ్ టెంపుల్లో అర్చ‌కుల మంత్రాలు చ‌ద‌వ‌టం ద‌గ్గ‌ర నుంచి జ‌య‌జ‌య‌ధ్వానాల‌కు చెక్ ప‌డిన‌ట్లే.

హిమ‌గిరుల్లో వెల‌సిన అమ‌ర్ నాథ్ టెంపుల్ లో మంత్రాలు చ‌ద‌వొద్ద‌ని.. జ‌య‌జ‌య‌ధ్వానాలు చేయొద్ద‌ని.. గంట‌లు కొట్టొద్ద‌ని జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ తాజాగా ఆదేశించింది. యాత్రికుల‌కు స‌రైన స‌దుపాయాలు క‌ల్పించ‌టం లేదంటూ దాఖ‌లైన పిటిష‌న్‌ పై విచార‌ణ సంద‌ర్భంగా ఎన్జీటీ ఛైర్ ప‌ర్స‌న్ జ‌స్టిస్ స్వ‌తంత్ర కుమార్ ఈ ఆదేశాలుజారీ చేశారు. ఎందుకిలా అంటే.. ఆల‌యంలో కొట్టే గంట‌లు.. జ‌య‌జ‌య‌ధ్వానాలు.. ఆర్చ‌కుల మంత్రార్చ‌న కార‌ణంగా హిమ‌గిరుల్లో శ‌బ్దా కాలుష్యం అంత‌కంత‌కూ పెరుగుతుంద‌ని.. వాటికి చెక్ చెప్పే ప‌నిలో భాగంగా తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

గుహ వ‌ర‌కూ యాత్రికులు సెల్ ఫోన్లు తీసుకు వెళ్ల‌కుండా వాటిని చివ‌రి చెక్ పాయింట్ ద‌గ్గ‌ర డిపాజిట్ చేయాల‌ని.. భ‌క్తుల‌ను ఒక వ‌రుస‌లో మాత్ర‌మే అనుమ‌తించాలంటూ పేర్కొన్నారు.

ఈ మ‌ధ్య‌నే జ‌మ్మూక‌శ్మీర్ లోని వైష్ణో దేవి ఆల‌యంలో కూడా ఇలాంటి నిషేధాన్నే విధిస్తూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. వైష్ణోదేవి టెంపుల్లో అయితే రోజుకు 50వేల మంది కంటే ఎక్కువ మంది భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాన్నిక‌ల్పించొద్ద‌ని పేర్కొంది. ఈ తీరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో ప్ర‌సిద్ధ‌మైన పుణ్య‌క్షేత్రాల సంద‌ర్శ‌న విష‌యంలోనూ రేష‌న్ పెడ‌తారేమో? కాలుష్యం.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ లాంటి మాట‌లతో ఆంక్ష‌లు విధించ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైపోతుంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.