Begin typing your search above and press return to search.

గ‌ల్లీలోకాదు ఢిల్లీలోనూ కూడా ఆందోళ‌న‌లు చేయ‌లేం

By:  Tupaki Desk   |   6 Oct 2017 4:49 AM GMT
గ‌ల్లీలోకాదు ఢిల్లీలోనూ కూడా ఆందోళ‌న‌లు చేయ‌లేం
X
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ల‌చిందే ఢిల్లీలో జ‌రిగిందే. అది కూడా న్యాయ‌స్థానం రూపంలో. తెలంగాణ‌లో నిర‌స‌న‌లు అణిచివేసేందుకు సీఎం కేసీఆర్ హైద‌రాబాద్‌ లోని ఇందిరాపార్క్ వ‌ద్ద‌నున్న ధ‌ర్నాచౌక్‌ ను ఎత్తివేయించిన సంగతి తెలిసిందే. దీనికై టీఆర్ ఎస్ పార్టీ మిగతా రాజ‌కీయపార్టీలు - ప్ర‌జాస్వామ్య సంఘాలు - మ‌హిళా - విద్యార్థి సంఘాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. అయిన‌ప్ప‌టికీ కేసీఆర్ వెన‌క్కు త‌గ్గ‌లేదు. అయితే గ‌ల్లీలో ఇలా నిర‌స‌న‌లను పాల‌కులుగా అణిచివేస్తే....దేశ రాజధాని న్యూఢిల్లీ ధర్నాచౌక్‌ పై ఎన్జీటీ (నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌) సంచలన తీర్పు ఇచ్చింది. జంతర్‌ మంతర్‌ వద్ద జరుగుతున్న ధర్నాలను ఆపాలని అటు ఢిల్లీ ప్రభుత్వంతోపాటు ఇటు పోలీసులను ఎన్జీటీ ఆదేశించింది.

ధర్నాచౌక్‌ లో జరుగుతున్న నిరసనల వల్ల ఆ ప్రాంతమంతా శబ్దంతో నిండిపోతోందని, అంతేగాక శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న ధర్నాచౌక్‌ వద్ద జరుగుతున్న ధర్నాలను వెంటనే ఆపాలని ఎన్జీటీ ఆదేశించింది. జంతర్‌ మంతర్‌ కు బదులు అజ్మీరీ గేటు సమీపంలోని రామ్‌ లీలా మైదానం దగ్గర ధర్నాలు - నిరసనలను తెలిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించింది. జంతర్‌ మంతర్‌ వద్ద ఉన్న తాత్కాలిక నిర్మాణాలు, లౌడ్‌ స్పీకర్లను వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థతోపాటు ఢిల్లీ పోలీసు కమిషనర్‌ ను ఆదేశించింది. జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం పర్యావరణ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్జీటీ స్పష్టం చేసింది. నిరసనలు, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలతో జంతర్‌ మంతర్‌ వద్ద శబ్ద కాలుష్యం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

మొత్తంగా ఆందోళ‌న‌కారులు... ప్ర‌జాస్వామ్య‌వేదిక‌లు...కేంద్ర పెద్ద‌ల‌కు త‌మ గ‌ళం వినిపించేందుకు పార్ల‌మెంటు స‌మీపంలోని జంత‌ర్‌ మంత‌ర్ వ‌ద్ద‌కు వేదిక‌గా చేసుకొని ఢిల్లీలో గ‌ళం వినిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఎన్జీటీ ఆదేశాల‌తో గ‌ల్లీలోనే కాదు ఢిల్లీలో కూడా నిర‌స‌న‌లు - ఆందోళ‌న‌లు చేసే అవ‌కాశం కోల్పోయింద‌ని అంటున్నారు.