Begin typing your search above and press return to search.
తెలంగాణకు NHRC సభ్యులు.. పర్యటన వివరాలివే
By: Tupaki Desk | 7 Dec 2019 9:52 AM GMTతెలంగాణలో దిశ హంతకులను ఎన్ కౌంటర్ చేసిన వైనంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సీ) సీరియస్ అయ్యి తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్ కౌంటర్ పై సమగ్ర విచారణ జరిపేందుకు శనివారం జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ మొత్తం కాలినడకన పరిశీలించారు. పోలీస్ ఉన్నతాధికారులతో భేటి అయ్యారు. ఎన్ కౌంటర్ లో గాయపడ్డ ఇద్దరు పోలీసులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి నుంచి వివరాలను సేకరించనున్నారు.
ఇక హైదరాబాద్ లో ఎన్ కౌంటర్ పై దర్యాప్తు చేశాక వీరు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లనున్నారు. అక్కడ భద్రపరిచిన నిందితుల మృతదేహాలను కూడా ఎన్.హెచ్.ఆర్సీ బృందం పరిశీలించనుంది. ఎన్.హెచ్.ఆర్సీ, హైకోర్టు విచారణ తర్వాతే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇక నిందితుల మృతదేహాల పోస్టుమార్టం వివాదానికి దారితీసింది. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఉండగా..గాంధీ ఆస్పత్రి వైద్యులను పోస్టుమార్టంకు తీసుకురావడంపై స్థానిక వైద్యులు గొడవకు దిగారు. విధులను బహిష్కరించారు.
ఇక దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ పై కేసు నమోదైంది. ఏసీపీ సురేందర్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. విచారణ అధికారిగా సురేందర్ రావును నియమించారు. వీరు ఎన్ కౌంటర్ పై విచారణ జరుపుతున్నారు.