Begin typing your search above and press return to search.
ఐసిస్ లో చేరిన ఆంధ్రా సైంటిస్ట్
By: Tupaki Desk | 18 Jan 2017 2:10 PM GMTఅంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఐసిస్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి చేరే వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. గల్ఫ్ లో ఉద్యోగం కోసమని ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన ఇద్దరు ఐసిస్ లో చేరినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మచిలీపట్నంకు చెందిన తలిరుల్ రహమాన్ - గుంటూరుకు చెందిన ఓ సైంటిస్ట్ ఉద్యోగం కోసమని గల్ప్ కు వెళ్లి అక్కడ్నుంచి ఐసిస్ లో చేరినట్లు జాతీయ దర్యాఫ్తు బృందం (ఎన్ ఐఏ) పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గల్ప్ కు వెళ్లే యువకులపై ప్రభుత్వం నిఘా పెట్టింది.
మరోవైపు హైదరాబాదులో పేలుళ్లకు కుట్ర పన్నిన జాఫర్ ను ఎన్ ఐఏను అనంతపురంలో అరెస్టు చేసింది. ఇతను మహ్మద్ యాజ్దానీతో కలిసి భాగ్యనగరంలో పేలుళ్లకు కుట్ర పన్నాడు. మహ్మద్ ఇర్ఫాన్ హైదరాబాద్ మీరాలంమండికి చెందినవాడు. అతనిని అరెస్టు చేసిన అనంతరం నాడు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇర్ఫాన్ కు ఎన్ ఐఏ కోర్టు ఏడు రోజుల రిమాండ్ విధించింది. ఐసిస్ ప్రోద్బలంతో ఇర్ఫాన్ హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్రపన్నినట్లు ఎన్ ఐఏ అభియోగం మోపింది. అనంతపురం - నల్గొండ జిల్లా పోచంపల్లి నుంచి ఇర్ఫాన్ పేలుడు పదార్ధాలు సేకరించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. గతేడాది జూన్ లో ఎన్ ఐఏ హైదరాబాద్ లో ఏడుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/