Begin typing your search above and press return to search.

గుజరాత్ లో ఐఎస్ ఐ ఏజెంట్ అరెస్ట్...ఏంచేశాడంటే!

By:  Tupaki Desk   |   31 Aug 2020 11:50 AM GMT
గుజరాత్ లో ఐఎస్ ఐ ఏజెంట్ అరెస్ట్...ఏంచేశాడంటే!
X
పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ ఐ కోసం పనిచేసిన ఓ ఏజెంట్ ను గుజరాత్ లో అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) వెల్లడించింది. పశ్చిమ ఖచ్ జిల్లా ముంద్రా రేవులో నిందితుడు రజాక్‌ భాయ్ కుంభర్ సూపర్‌ వైజర్ ‌గా పనిచేసినట్లు తెలిసింది. ఈ సంవత్సరంలో జనవరిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన ఓ కేసు విచారణలో లభించిన ఆధారాలతో ఎన్ ఐ ఏ సోమవారం అతడిని అరెస్ట్ చేసింది.

ఉత్తరప్రదేశ్ ‌లో పోలీసులకు చిక్కిన నిందితుడు మొహమ్మద్ రషీద్ పాకిస్థాన్‌ కు చెందిన రక్షణ, ఐఎస్ ఐ అధికారులకు మనదేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని చేరవేసినట్లు ఎన్ ఐ ఏ దర్యాప్తులో వెల్లడైంది. అలాగే మరో రెండుసార్లు పాక్ కి వెళ్లి అక్కడి అధికారులతో కూడా భేటీ అయినట్లు వెల్లడైంది. భద్రతా బలగాల కదలికలు, రక్షణశాఖ ప్రదేశాల సమాచారం చేరవేసినట్లు గుర్తించారు. ఈ కేసు విచారణలో గుజరాత్ ‌కు చెందిన రజాక్ ‌భాయ్ కుంభర్ కూడా ఐఎస్ ఐ ఏజెంట్‌ గా పని చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఐఎస్ ఐ ఇచ్చిన ఆదేశాలతో అతడు రూ. 50వేలు పేటీఎం ద్వారా పంపినట్లు తెలిసింది. ఆగస్టు 27న రజాక్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఎన్ ఐ ఏ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు ఎన్ ఐ ఏ అధికారులు తెలిపారు.