Begin typing your search above and press return to search.
మనోళ్లపై పాక్ ప్రేమ వల..విశాఖలో ముఖ్యుడి అరెస్ట్
By: Tupaki Desk | 16 May 2020 1:30 AM GMTకుట్రలకు కేరాఫ్ అడ్రస్, తన దేశం అభివృద్ఢి గురించి కాకుండా... పక్కనున్న భారత్‌ను అణగదొక్కడంపై నిత్యం ఆలోచించే పాకిస్థాన్ పాడు బుద్ధి కుట్ర బట్టబయలు అయింది. ఓ వైపు ఉగ్రవాద చర్యలు చేస్తూనే మరోవైపు రహస్యంగా కుట్రలు చేస్తున్న పాక్ ఎత్తుగడల్లో పాల్గొన్న ప్రధాన నిందితుడు దొరికాడు. విశాఖ నౌకాదళ రహస్యాల గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రధాన కుట్రదారుడిని అరెస్ట్ చేసింది. గూడఛర్యం కేసులో ముంబయికి చెందిన మహ్మద్ హరూన్ హాజీ ప్రధాన కుట్రదారుడిగా తేల్చింది. ప్రేమ పేరుతో మన నేవీ సిబ్బందిపై మహ్మద్ హరూన్ కుట్రలు పన్నాడని నిర్ధారించింది.
అరెస్ట్ సమయంలో రహమాన్ నుంచి డిజిటల్ డివైజ్‌లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని కీలక సమాచారం కోసం విచారణ కొనసాగుతున్నట్లు ఎన్‌ఐఏ అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, గూఢచర్యం కేసులో నౌకదళ సిబ్బంది సహా 11 మందిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.
యుద్ధనౌకలు, జలాంతర్గాముల రహస్యాలను సేకరించాలని పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ(ఐఎస్‌ఐ) సిద్ధమైంది. ఇందుకోసం `మహ్మద్ హరూన్ హాజీ`ని ఎంపిక చేసుకుంది. పాక్ యువతులతో ప్రేమాయనం, డబ్బుల పంపిణీ ఆపర్లతో నేవీ రహస్యాలను మహ్మద్ సేకరించి పాక్‌కు అందించాడు. ఇండియన్ నేవీకి చెందిన నౌకలు, సబ్‌మెరైన్‌ల లోకేషన్‌లను హనీట్రాప్‌లో పడ్డ అధికారుల ద్వారా పొంది ఐఎస్ఐకి ఇచ్చాడు. అయితే, ఎన్ఐఐకు ఈ హనీట్రాప్ గురించి తెలిసింది. పాక్ ఈ కుట్ర ద్వారా అధికారుల నుంచి కీలక సమాచారం సేకరించి పాకిస్థాన్‌కు చేరవేసినట్లు గుర్తించారు. అనంతరం 120బి, 121ఏ, ఐపీసీ సెక్షన్ 17, 18 మరియు సెక్షన్ 3యాక్ట్ కిందన ఎన్‌ఐఏ కేసులు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేసింది.