Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్లాన్లన్నీ ఒక్కదెబ్బతో పోయాయా..?

By:  Tupaki Desk   |   13 Aug 2018 7:32 AM GMT
కేసీఆర్ ప్లాన్లన్నీ ఒక్కదెబ్బతో పోయాయా..?
X
పెద్ద ఎత్తున పోలీస్ నియామకాలు.. పోలీసులకు అత్యాధునిక వాహనాలు - ఆయుధాలు.. పోలీసులు ఇలా కోరడం ఆలస్యం.. అలా మంజూరు చేసేస్తున్నారు కేసీఆర్. తెలంగాణ వస్తే మావోయిస్టులు పెరుగుతారని.. శాంతి భద్రతల సమస్య వస్తుందని ఆడిపోసుకున్న వారికి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసి కేసీఆర్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు.. ఇప్పుడు తెలంగాణలో అత్యంత బలమైన వర్గం ఏదైనా ఉంటే అది పోలీసులే.. సీఎం కేసీఆర్ తోడ్పాటుతో తెలంగాణపై ఈగ వాలకుండా అలజడి రేకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు.

కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ పోలీసులు వినూత్న విధానాలను అవలంబించారు. షీటీమ్స్ - డ్రంకెన్ డ్రైవ్ లతో ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరైనా తాగి రావాలన్నా.. ఆడపిల్లలను అల్లరి చేయాలన్నా భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు.

ఇక పోలీసులు సాధించిన మరో పురోగతి ‘కార్డెన్ సెర్చ్’ ఉగ్రవాదులు - అసాంఘిక శక్తులకు తెలంగాణలో ఆశ్రయం లేకుండా చేసేందుకు ఉదయం 4 గంటలకు చేసే ఈ తనిఖీలతో దారుణాలకు పాల్పడే ఎవ్వరూ తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోకుండా పరిస్థితి తయారైంది. ఇంతటి గట్టి నిఘాలో కూడా లోపం ఉందని మరోసారి నిరూపితమైంది.

నేషనల్ ఇన్విస్టిగేషన్ బ్యూరో (ఎన్ ఐఏ) అధికారులు తాజాగా హైదరాబాద్ లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పలువురిని కొద్దిరోజుల క్రితం పట్టుకెళ్లారు. వారిని ఈ రోజు అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో అబ్దుల్ బాసిత్ - అబ్దుల్ ఖాదిర్ అనే వారు ఐసిస్ సానుభూతిపరులని.. కుట్ర పన్నడానికి హైదరాబాద్ లో తిష్ట వేశారని పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇంత పకడ్బందీగా చర్యలు చేపట్టినా మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలకు అవకాశం దక్కడంపై కేసీఆర్ అండ్ పోలీసులు నిర్ఘాంతపోయినట్టు తెలిసింది. పాతబస్తీలో ఎంఐఎంతో ఉన్న దోస్తీ కారణంగా టీఆర్ ఎస్ ప్రభుత్వం అక్కడ సరియైనా నిఘా పెట్టడం లేదని ఇదే ఉగ్రమూకలకు అవకాశం కల్పిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరిన్ని ప్రాణాలు పోకముందే కేసీఆర్ ఇప్పటికైనా నిఘా పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.