Begin typing your search above and press return to search.
ఎన్ ఐఏ లేకపోతే...దేశం భస్మమైపోయేది
By: Tupaki Desk | 27 Dec 2018 7:22 AM GMTఅంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) మనదేశంపై జరిపిన కుట్ర భగ్నమైంది. దేశ రాజధాని సహా పలు రాష్ర్టాల్లో ఆత్మాహుతి దాడులకు పథక రచన చేసిన ఐసిస్ పన్నాగాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) అధికారులు బుధవారం విఫలం చేశారు. ఢిల్లీ - లక్నోల్లో దాడులు జరిపి - ఈ కుట్రతో సంబంధముందని భావిస్తున్న 10మందిని అరెస్టు చేశారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా వీరు హర్కతుల్ హర్బే ఇస్లాం (హెచ్ హెచ్ ఐ) అనే సంస్థను నడుపుతున్నట్లు గుర్తించారు. భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు హెచ్ హెచ్ ఐ సంస్థ ప్రయత్నిస్తున్నదని నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఎన్ ఐఏ ఈ దాడుల్ని నిర్వహించింది. వారి నుంచి ఓ రాకెట్ లాంచర్ ను - భారీగా మారణాయుధాలను - పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ - ఉత్తర ప్రదేశ్ తోపాటు పలు రాష్ర్టాల్లో భారీ విధ్వంసానికి ఐసిస్ ప్లాన్ చేసినట్లు.. బుధవారం ఉదయం నిఘా వర్గాలు గుర్తించాయి. వీఐపీలతోపాటు పలు కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారని - జనవరి 26న గణతంత్ర వేడుకల సందర్భంగా ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేసుకున్నారని సమాచారం అందింది. ఉగ్రదాడులకు వ్యూహరచన చేస్తున్నారని - వీరి వద్ద భారీస్థాయిలో పేలుడు సామాగ్రి ఉందని ఐబీ వర్గాలు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన ఎన్ ఐఏ ఢిల్లీలోని జాఫరాబాద్ - సీలంపూర్ - ఉత్తరప్రదేశ్ లోని మీరట్ - అమ్రోహా - హాపూర్ - లక్నో సహా మొత్తం 17 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఐసిస్ కు అనుబంధంగా నడుస్తున్న హర్కతుల్ హర్బే ఇస్లాం (ఇస్లాం కోసం యుద్ధం) అనే సంస్థతో సంబంధమున్న 16మంది అనుమానితులను ఎన్ ఐఏ అదుపులోకి తీసుకుంది. వారిలో 10మందిని అరెస్టు చేయగా - మిగిలిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు బృందం విచారణ జరుపుతున్నది.
అరెస్టయిన 10మందిని మహ్మద్ సుహైల్ (29) - అనస్ యూనస్(24) - రషీద్ జాఫర్ రఖ్ అలియాస్ జాఫర్ (23) - సయీద్ అహ్మద్ (28) - రేయీస్ అహ్మద్ (26) - జుబేర్ మాలిక్ (20) - జాయిద్ మాలిక్ (22) - సాబిక్ ఇఫ్తెకార్ (26) - మహ్మద్ ఇర్షాద్ (20) - మహ్మద్ ఆజం (35)గా గుర్తించారు. ఐసిస్ తో ప్రేరణ పొందిన చాలామందిని తమ తనిఖీల సందర్భంగా గుర్తించామని - మరికొందరిని అరెస్టు చేసే అవకాశముందని ఎన్ ఐఏ ఐజీ అలోక్ మిట్టల్ వెల్లడించారు. అరెస్టయిన వారిపై ఇప్పటివరకు నేర చరిత ఏదీ లేదని - సొంత నిధులతో వారు సంస్థను నడుపుతున్నారని తెలిపారు. వారు ఆపరేషన్ లకు సిద్ధమవుతున్నారు. బాంబులను - రిమోట్ కంట్రోల్ తో పనిచేసే పేలుడు సామగ్రిని సమీకరించుకునే పనిలో వారు నిమగ్నమయ్యారు అని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ - రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యాలయాలను వారు లక్ష్యంగా చేసుకున్నారంటున్న వార్తలపై స్పందించిన అలోక్ మిట్టల్.. తగినంత ఆధారాల్లేకుండా నిర్ధారించలేమని చెప్పారు.
పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా కేంద్రంగా హెచ్ హెచ్ ఐ సంస్థ పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. దాడులకు కుట్ర చేస్తున్న ఉగ్రవాదులు ఒకరితో ఒకరు నిరంతరం మాట్లాడుకుంటున్నారని ఎన్ ఐఏ వర్గాలు వెల్లడించాయి. వాట్సప్ - టెలిగ్రామ్ - ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వారంతా పరస్పరం సంప్రదించుకుంటున్నారని తెలిపాయి. మూడు - నాలుగు నెలల కిందటే ఈ సంస్థను వారు ఏర్పాటు చేసుకున్నారని భావిస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారానే వారంతా పరిచయమయ్యారని చెబుతున్నారు. వారికి ఎవరెవరు సహకరిస్తున్నారో గుర్తించే పనిలో ఉన్నామని ఎన్ ఐఏ అధికారులు స్పష్టంచేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ - యూపీ పోలీసుల ఉగ్రవాద వ్యతిరేక దళం సహకారంతో ఎన్ ఐఏ తనిఖీలను చేపట్టింది.
హర్కతుల్ హర్బే ఇస్లాం కార్యకలాపాలకు ఇద్దరు వ్యక్తులు సూత్రధారులని ఎన్ ఐఏ అధికారులు గుర్తించారు. వారి నాయకత్వంలోనే దాడులకు సిద్ధమవుతున్నారని భావిస్తున్నారు. వారిలో ఒకరు అమ్రోహాకు చెందిన మహ్మద్ సుహైల్ అలియాస్ హజ్రత్ కాగా.. మరొకరు డిగ్రీ మూడవ సంవత్సర విద్యార్థి. 29 ఏండ్ల సుహైల్ అమ్రోహాలోని ఓ మదర్సాలో పనిచేస్తూ.. ముస్లిం మత సంబంధ విషయాల్లో ఆదేశాలు జారీ చేసే ముఫ్తీ (మౌలానా)గా వ్యవహరిస్తున్నాడు. సోదాల సందర్భంగా బాంబులు ఎలా పేల్చాలో సోహైల్ వివరిస్తున్న ఓ వీడియోను కూడా ఎన్ ఐఏ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. సంస్థ సభ్యులు ఏఏ ప్రాంతాలకు చెందినవారో గుర్తించి - ఆయా ప్రాంతాల్లో వారి సంబంధాలపై ఆరా తీయాల్సి ఉందని ఎన్ ఐఏ అధికారులు చెబుతున్నారు.