Begin typing your search above and press return to search.
కోడి కత్తి కేసులో కీలక ఆధరాలు దొరికాయా..?
By: Tupaki Desk | 17 Jan 2019 4:10 PM GMTకోడి కత్తి కేసు... ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్. జగన్మోహాన రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడితో సంచలనంగా మారిన కేసు. పాదాయాత్ర ముగించుకుని హైదరాబాద్‌కు వస్తున్న జగన్మోహాన రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో తూర్పు గోదావరికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేసిన సంగతి తెల్సిందే. ఈ దాడిపై దర్యాప్తు జరుపుతామన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వ్యవహార శైలికి జగన్ తప్పు పట్టారు. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని వేరే ఏ ఏజేన్సీకైన దర్యాప్తును అప్పగించాలని జగన్ కోరారు. దీనిని అనుసరించి కేసుపై విచారణను జాతీయ నేర పరిశోధన విభాగానికి కేంద్రం బదలాయించింది. దీంతో గడచిన ఐదు రోజులుగా ఈ కేసులో నిందితుడు శ్రీనివాసు ఎన్ఐఏ పోలీసులు విచారిస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి లాయర్ సమక్షంలో నిందుతుడు శ్రీనివాసును కేసుకు సంబంధించి విచారిస్తున్నారు.
ఐదు రోజుల విచారణలో కీలక అంశాలను ఎన్ఐఏ అధికారులు రాబట్టినట్టు చెబుతున్నారు. కోడికత్తితో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, దీని వెనుక ఏఏ పెద్దలు ఉన్నారు వంటి కీలక అంశాలపై సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. తాను జగన్ అభిమానినని ఆయనకు సానుభూతి తెచ్చేందుకే ఈ దాడి చేసేనని నిందుతుడు శ్రీనివాస్ ప్రకటించారు. అయితే ఈ దాడి వెనుక ఏఏ శక్తులు ఉన్నయి, ఎవరెవరి పాత్ర ఉంది వంటి అంశాలపై జాతీయా నేర పరిశోధన సంస్ధ కీలక సమాచారం రాబట్టినట్లు చెపుతున్నారు. విశాఖ విమానాశ్రయ క్యాంటీన్‌లో కోడి కత్తి కేసు నిందుతుడు శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. ఈ క్యాంటీన్ కు యజమాని తెలుగుదేశం నాయకుడు కావడంతో కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు జరిగిన విచారణలో నిందుతుడు శ్రీనివాస్ కీలక విషయాలను ఎన్ఐఏ అధికారులకు వెల్లడించినట్లు చెబుతున్నారు. దీంతో ఈ కేసులో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచన వేస్తున్నారు.