Begin typing your search above and press return to search.
గన్ను పెన్ను : భాగ్యనగరిలో అన్నలున్నారా ? మోడీ మనుషుల ఆరా !
By: Tupaki Desk | 23 Jun 2022 1:58 PM GMTమెదక్ జిల్లా, చేగుంటలోనూ, అదేవిధంగా మేడ్చల్ లోనూ, హైద్రాబాద్ ఉప్పల్ లోనూ ఈ రోజు ఉదయం నుంచి ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. మావో అగ్రనేత దుబాషి శంకర్ ను విచారించారని కూడా తెలుస్తోంది. మేడేపల్లి పర్వతాపూర్ లోనూ నక్సల్ అనుబంధాలున్న కుటుంబాలపై పోలీసుల దృష్టి పడింది. ఇక్కడ ఎన్కౌంటర్ లో చనిపోయిన ప్రభాకర్ భార్యను కూడా విచారించారని తెలుస్తోంది.
ఓకే సారి అటు భాగ్య నగరిలోనూ ఇటు ఇతర ప్రాంతాల్లోనూ నక్సల్ అనుబంధాలున్న కుటుంబాలపై పోలీసుల దాడులు సంబంధిత వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మేడ్చల్ లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ప్రభాకర్ భార్యతో పాటు, న్యాయ వాది దేవేంద్ర కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైతన్య మహిళా సంఘంలో పనిచేసిన అనుభవం ఉండడంతో న్యాయవాది దేవేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అన్న సమాచారం వస్తోంది.
2017 డిసెంబర్, విశాఖ జిల్లా, పెద్దబయలు పోలీసు స్టేషన్లో నమోదయిన మిస్సింగ్ కేసు కు సంబంధించి ఇన్నాళ్లకు ఓ క్లూ దొరికింది. ఇప్పుడు ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి నక్సల్ ఉద్యమంకు సంబంధించిన విషయంగా తేలింది.
దీంతో అనుమానితులను కేంద్ర దర్యాప్తు బృందాలు పట్టుకుని, ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు. మెదక్ లోనూ ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా నక్సలైట్ కుటుంబాలను అదేవిధంగా ఇతరులనూ కూడా విచారిస్తున్నారు. ఈ ఉదయం నుంచి రేగుతున్న ఈ కలవరం ఇంకా కొనసాగుతోంది.
హైద్రాబాద్ నగరంలో కలకలం రేగింది. ఉప్పల్ లో న్యాయవాది శిల్ప ఇంట్లో కేంద్ర దర్యాప్తు బృందం ( నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ) రంగంలోకి దిగి సోదాలు చేసింది. విశాఖలో నర్సింగ్ విద్యార్థిని రాధ మిస్సింగ్ కేసును దర్యాప్తునకు స్వీకరించిన ఎన్ఐఏ ప్రస్తుతం శిల్పను విచారిస్తోంది.
రాధను మావోయిస్టులలో చేర్చారు అన్న అభియోగంపై విచారణ చేస్తోంది. గతంలో చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్, మావోయిస్టుల అనుబంధ సంఘం)లో పనిచేశారన్న కారణంతో ఆమె ను విచారిస్తున్నారు. రాధను లాయర్ శిల్ప మావోయిస్టుల ఉద్యమంలోకి చేర్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మాదాపూర్ ఎన్ఐఏ కార్యాలయంలో శిల్పను పోలీసులు ఇంట్రాగేట్ చేస్తున్నారు. అయితే తమకూ, రాధకూ ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెబుతున్నా లాయర్ శిల్ప భర్త బండి కిరణ్ అంటున్నారు.