Begin typing your search above and press return to search.

జగన్‌ పై ఉద్దేశపూర్వకంగానే దాడి: ఎన్ ఐఏ

By:  Tupaki Desk   |   31 Jan 2019 5:55 AM GMT
జగన్‌ పై ఉద్దేశపూర్వకంగానే దాడి: ఎన్ ఐఏ
X
జగన్‌ పై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసుని నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ కేసుకి సంబంధించిన అన్ని పూర్వపరాలను పరిశీలించింది ఎన్ ఐఏ. ఫైనల్‌ గా వైఎస్‌ జగన్‌ పై గత ఏడాది అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంఉద్దేశ పూర్వకంగా జరిగిందేనని ఎన్‌ ఐఏ తేల్చి చెప్పింది. దాడి గురి తప్పింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే మరణం సంభవించి ఉండేదని.. అందుకే జగన్‌ పై జరిగిన దాడిని హత్యాయత్నంగా పరిగణిస్తూ ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించింది ఎన్ ఐఏ.

జగన్‌ పై దాడి ఘటనపై దర్యాప్తును ఎన్‌ ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ ఉత్తర్వుల్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. అందుకే ఎన్ ఐఏకు అప్పగించారని వాదిస్తోంది ఏపీ ప్రభుత్వం. దీంతో.. పిటీషన్‌ను విచారణ జరిపిన న్యాయస్థానం.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం - ఎన్ ఐఏలను ఆదేశించారు.

ఎయిర్‌ పోర్ట్‌ లో చట్ట విరుద్ధంగా - ఉద్దేశ పూర్వకంగా ఏదైనా వస్తువుని - ఆయుధాన్ని ఉపయోగించి హింసకు లేదా దాడికి పాల్పడటం నేరం. ఈ దాడి - లేదా హింసలో ఎవరైనా తీవ్రంగా గాయపడినా - మరణించినా అది పౌర విమానయాన చట్టం ప్రకారం చట్టవ్యతిరేక కార్యకలాపాల పరిధిలోకివస్తుంది. జగన్‌ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం -సీఐఎస్‌ ఎఫ్‌ - ఇంటెలిజెన్స్‌ బ్యూరో - ఎన్‌ ఐఏలు ఇచ్చిన సమాచారాన్నిక్షుణ్ణంగా పరిశీలించి తర్వాత.. ఇది చట్టవ్యతిరేక కార్యకలాపాల పరిధిలోకివస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికఅభిప్రాయానికి వచ్చింది. అందుకే కేసుని ఎన్ఐఏకి అప్పగించిందని ఎన్ ఐఏ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి జగన్‌ పై దాడి కేసు.. ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగిందనే చెప్పాలి.