Begin typing your search above and press return to search.

బాబు మొండికేస్తే!..ఎన్ ఐఏ ఊరుకుంటుందా?

By:  Tupaki Desk   |   8 Jan 2019 1:32 PM GMT
బాబు మొండికేస్తే!..ఎన్ ఐఏ ఊరుకుంటుందా?
X
ఏపీ విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం ద‌ర్యాప్తు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. సాక్షాత్తు విప‌క్ష నేత‌పైనే విశాఖ ఎయిర్‌పోర్టులో హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటే... నిజంగానే రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం కాక మాన‌దు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌ పై దాడి జ‌రిగిన వెంట‌నే బాధ్య‌తాయుతంగా స్పందించాల్సిన చంద్ర‌బాబు స‌ర్కారు.. అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించింది. జ‌గ‌నే త‌న‌పై తాను దాడి చేయించుకున్నార‌ని - దాడి చేసిన వ్య‌క్తి కూడా జ‌గ‌న్ అభిమానే అని, ఈ దాడితో జనాల్లో సింప‌తీ సంపాదించుకోవ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని కూడా టీడీపీ స‌ర్కారుతో పాటు బాధ్య‌త క‌లిగిన డీజీపీ హోదాలో ఉన్న సీనియ‌ర్ ఐపీఎస్ ఆర్పీ ఠాకూర్ కూడా దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర పోలీసుల‌పైన గానీ - ఏపీ ప్ర‌భుత్వం పైన గానీ త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని - ఈ కేసు ద‌ర్యాప్తును కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు అప్ప‌గించాల‌ని జ‌గ‌న్ హైకోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు కూడా జ‌గ‌న్ వాదన క‌రెక్టేన‌న్న కోణంలో స్పందించి... కేసును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ)కు అప్ప‌గించింది.

కోర్టు ఆదేశాల‌నైనా చంద్ర‌బాబు స‌ర్కారు పాటించిందా? అంటే... అదీ లేదు. కోర్టు తీర్పుపై సింగిల్ కామెంట్ చేయ‌కుండానే... కేసును నీరు గార్చే దిశ‌గా చేయాల్సిన తంతునంతా చాలా సైలెంట్‌ గా సాగిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయా కేసుల ద‌ర్యాప్తులో త‌న‌దైన దూకుడు ప్ర‌దర్శించ‌డంతో పాటు కేసు ద‌ర్యాప్తును నిర్ణీత గడువు కంటే ముందుగానే తేల్చేసే ల‌క్ష‌ణ‌మున్న ఎన్ ఐఏ... జ‌గ‌న్ పై దాడి కేసును కూడా ఛాలెంజింగ్‌ గానే తీసుకుంది. హైకోర్టు ఆదేశాలు అంద‌డ‌మే త‌రువాయి ఎఫ్ ఐఆర్ దాఖ‌లు చేసిన ఆ సంస్థ అధికారులు... ఇప్ప‌టిదాకా కేసును ద‌ర్యాప్తు చేసిన ఏపీ పోలీసుల నుంచి వివ‌రాల సేక‌ర‌ణ‌కు య‌త్నించింది. అయితే ఈ కేసు ద‌ర్యాప్తు కోస‌మంటూ చంద్ర‌బాబు స‌ర్కారు ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) కార్యాల‌యానికి వెళ్లిన ఎన్ ఐఏ అధికారుల‌కు నిజంగానే షాక్ త‌గిలింది. త‌మ‌కు తాముగా వివ‌రాలు అంద‌జేసే ప్ర‌సక్తే లేద‌ని తేల్చేసిన సిట్‌... అందుకు ప్ర‌భుత్వం నుంచి గానీ - విశాఖ పోలీస్ క‌మిష‌న‌ర్ నుంచి గానీ అదేశాలు కావాల్సిందేన‌ని తొండి వాద‌న చేసింది. దీంతో ఈ కేసులో రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ద‌మ‌న నీతిని ప‌సిగ‌ట్టేసిన ఎన్ ఐఏ అధికారులు... త‌మ ప‌నిని తాము చేసుకుపోయేందుకు రంగంలోకి దిగారు.

ఇందులో భాగంగానే హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసి.. కేసు వివ‌రాల‌న్నింటినీ త‌మ‌కు అంద‌జేసేలా ఆదేశాలు జారీ చేయాల‌ని అభ్య‌ర్థించింది. అంతేకాకుండా కేసును విశాఖ‌లో కాకుండా విజ‌య‌వాడ నుంచి ద‌ర్యాప్తు చేసేందుకు అనుగుణంగా విజ‌య‌వాడ‌కు బద‌లాయించాల‌ని కూడా కోరింది. అంతటితో ఆగ‌ని ఎన్ ఐఏ... ప్ర‌స్తుతం జ్యూడీషియ‌ల్ రిమాండ్ లో ఉన్న నిందితుడు శ్రీ‌నివాస‌రావును త‌మ క‌స్ట‌డీకి అప్ప‌గించాల‌ని కోరింది. కేసు ద‌ర్యాప్తులో భాగంగా ఇప్ప‌టిదాకా సిట్ సేక‌రించిన ప్ర‌తి ఆధారాన్ని - రాబ‌ట్టిన ప్ర‌తి చిన్న అంశాన్ని కూడా త‌మ‌కు అంద‌జేసేలా తక్ష‌ణ‌మే ఆదేశాలు జారీ చేయాల‌ని కూడా కోరింది. ఈ పిటిష‌న్ తోనే చంద్ర‌బాబు స‌ర్కారు తీరు - ఆ స‌ర్కారుకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న పోలీసుల వైఖ‌రి ఏమిటో అర్థం అయిపోయింద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అంతేకాకుండా హైకోర్టు త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న ఆదేశాల‌తో బాబు స‌ర్కారుతో పాటు... ఏపీ పోలీసులు కూడా ఎన్ఐఏకు స‌హ‌క‌రించ‌క త‌ప్ప‌ద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.