Begin typing your search above and press return to search.
హైదరాబాద్‌లో కొనసాగుతున్న వేట.. అదుపులోకి 10 మంది ఏం జరిగింది?
By: Tupaki Desk | 2 Oct 2022 5:43 PM GMTభాగ్యనగరం హైదరాబాద్‌పై సిట్ వేట కొనసాగుతోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ)లో క్రియాశీలకంగా ఉన్నారన్న నిఘావర్గాల సమాచారంతో హైదరాబాద్ ముసారాంబాగ్‌లో నివాసముంటున్న జావేద్‌ను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన బాంబుదాడి కేసులో జావేద్‌ను నిందితుడిగా అనుమానించి విచారించారు. ముసారాంబాగ్‌తో పాటు చంపాపేట్, సైదాబాద్, బాబానగర్, సంతోష్ నగర్‌లోని మరికొందరి ఇళ్లలో కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాయంతో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో సుమారు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఉగ్ర దాడుల కోసం కొంతమంది యువకులను జావేద్ ఇప్పటికే రిక్రూట్ చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో దాడులకు తెగబడి మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే సిట్ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారన్న ఆరోపణలతో పీఎఫ్‌ఐపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తెలుగు రాష్ట్రాల్లో నలుగుర్ని అరెస్టు చేసింది. ధార్మిక కార్యకలాపాల పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తున్నారంటూ పీఎఫ్‌ఐపై నిజామాబాద్‌లో స్థానిక పోలీసులు తొలుత కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని ఎన్‌ఐఏకు బదిలీ చేశారు.
దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు గతంలోనే ఒకసారి సోదాలు నిర్వహించారు. గత ఆదివారం రెండోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఈ సందర్భంగా పలు పత్రాలు, హార్డ్‌డిస్కులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బోధన్‌కు చెందిన సయ్యద్ సమీర్, ఆదిలాబాద్‌కు చెందిన ఫిరోజ్, జగిత్యాలకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్, నెల్లూరుకు చెందిన ఎండీ ఉస్మాన్‌లను అరెస్టు చేసి నాంపల్లిలోని నాలుగో అదనపు మున్సిపల్ సెషన్స్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. తాజా దాడులతో మరోసారి హైదరాబాద్ వార్తల్లోకి ఎక్కింది.