Begin typing your search above and press return to search.

ద‌డ పుట్టిస్తున్న ఎన్ ఐఏ సోదాలు.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   18 Nov 2021 1:30 PM GMT
ద‌డ పుట్టిస్తున్న ఎన్ ఐఏ సోదాలు.. రీజ‌నేంటి?
X
తెలుగు రాష్ట్రాల్లో జాతీయ ద‌ర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎన్‌ఐఏ అధికారులు పలువురి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో విరసం నేత కల్యాణ్ రావు, విశాఖ అరిలోవలోని శ్రీనివాసరావు, అన్నపూర్ణ ఇంట్లో సోదాలు చేపట్టారు.

హైదరాబాద్లోని నాగోల్లో రవిశర్మ, అనురాధ ఇళ్లలో తనిఖీలు చేపట్టిన ఎన్ఐఏ .. ఆర్కే జీవిత చరిత్రపై ప్రచురించే విషయాన్ని సైతం ఆరా తీసింది. దీంతో ఒక్క‌సారిగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర‌మైన అల‌జ‌డి రేగింది. అస‌లు ఏం జ‌రుగుతోంది.? ఎందుకు ఇలా సోదాలు నిర్వ‌హిస్తున్నారు? అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్త‌న్నాయి.

విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని హ‌త‌మార్చాల‌నే కుట్ర జ‌రిగిన విష‌యంపై ఆరా తీస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే.. విర‌సం నాయ‌కుడు, ర‌చ‌యిత‌.. వర‌వ‌ర‌రావును జైల్లో పెట్టింది. అదేస‌మ‌యంలో చాలా మంది ఉద్య‌మ నేత‌ల‌ను కూడా అదుపులోకి తీసుకుంది.

ఇక‌, మావోయిస్టుపై ఉక్కుపాదం మోపుతున్న విష‌యం కూడా తెలిసిందే. ఇటీవ‌లే జ‌రిగిన ఎన్ కౌంట‌ర్‌లో కీల‌క నేత తుంబ్డే స‌హా .. 26 మంది మావోయిస్టును కాల్చి చంపారు. అయితే.. మోడీని చంపేందుకు ఎవ‌రు కుట్ర ప‌న్నారు? అనే విష‌యం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు తేల లేదు. దీంతో ఇప్పుడు ఆదిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం మ‌రింత ముమ్మ‌ర చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు తెలిసింది.

దీనిలో భాగంగానే కీల‌క మావోయిస్టు నేత‌లను క‌ట్టడి చేసిన త‌ర్వాత‌.. కూడా ఇంకా మావోయిస్టుల‌కు సంబంధించిన ప్ర‌ణాళిక‌లు జ‌రుగుతున్నాయ‌ని.. మావోయిస్టుల‌కు ఉప్పందిస్తున్నార‌నే మిష‌తో క‌ళ్యాణ్‌రావు.. త‌దిత‌ర నేత‌ల ఇళ్ల‌పై దృష్టి పెట్టారు. దీనిలో ప్ర‌ధానంగా మోడీ స‌హా అమిత్‌షాను టార్గెట్ చేసుకున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందిస్తున్నారు. దీనికి సంబందించిన ఆధారాల కోసం.. అధికారులు ముమ్మ‌రంగా గాలింపు చేప‌ట్టారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ అదుపులోకి తీసుకోక‌పోయినా.. అన్న‌పూర్ణ‌, క‌ళ్యాణ్ రావు, ఆర్కే స‌హ‌చ‌రి శిరీష‌ల‌ను అదుపులోకి తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే.. ఈ ఆపరేష‌న్‌లో రాష్ట్రాల భాగ‌స్వామ్యం క‌నిపిచ‌డం లేదు. నేరుగా రంగంలోకిదిగిన ఎన్ ఐఏ.. మావోయిస్టు సానుభూతి ప‌రులే ల‌క్ష్యంగా దాడులు చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తుండడం.. గ‌మ‌నార్హం.