Begin typing your search above and press return to search.
అక్బరుద్దీన్ ను ఎన్ ఐఏ అరెస్ట్ చేయబోతుందా?
By: Tupaki Desk | 27 July 2019 2:30 PM GMTఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను అరెస్ట్ చేసే దిశగా కేంద్రంలోని బీజేపీ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘15 నిమిషాలు పోలీసులను పక్కనపెడితే దేశంలోని హిందూ-ముస్లిం జనాభా నిష్పత్తిని సమానం చేస్తాం’’ అంటూ అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం మరోసారి దృష్టి సారించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసాలో అక్బరుద్దీన్ అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యలపై అప్పట్లో పలు చోట్ల అక్బరుద్దీన్ కు వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయి. ఆ అన్ని కేసులను తిరగదోడి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఐఏకు అప్పగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం కరీంనగర్ సభలో అక్బర్ అప్పటి మాటలను గుర్తు చేయడంతో కేంద్రం ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల కరీంనగర్ లో మాట్లాడిన అక్బరుద్దీన్.. 2013లో తాను చేసిన వ్యాఖ్యల నుంచి ఆరెస్సెస్ వారు ఇంకా కోలుకోలేదని - అందుకే తనను ద్వేషిస్తున్నారంటూ నాటి వ్యాఖ్యలను గుర్తు చేశారు. దీంతో స్పందించిన బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలోనూ అక్బరుద్దీన్ పై ఫిర్యాదు చేశారు. దీంతో అక్బరుద్దీన్ వ్యాఖ్యల్లోని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కేసును ఎన్ ఐఏకు అప్పగించాలని బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్ర హోంశాఖను కోరినట్టు తెలుస్తోంది.
కేంద్ర హోంశాఖ కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. అక్బర్ పై ఇప్పటి వరకు నమోదైన కేసులు - చార్జిషీట్లు తదితర వివరాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నట్టు సమాచారం. భైంసాలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల ఆడియో టేప్ ఫోరెన్సిక్ నివేదిక ఏం చెప్పింది? గొంతు ఆయనదేనా? అన్న విషయాలను ఆరా తీస్తోంది. ఒకవేళ గొంతు అక్బరుద్దీన్ దే అయితే ఎన్ ఐఏకు ఎందుకు ఇవ్వలేదు? దర్యాప్తులో లోటుపాట్లు వంటి వివరాలను కూడా సేకరించినట్టు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా తెలంగాణకే చెందిన కిషన్ రెడ్డి ఉండడం.. కరీంనగర్ ఎంపీగా బీజేపీ నేత బండి సంజయ్ ఉండడంతో అక్బరుద్దీన్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో అక్బరుద్దీన్ అరెస్ట్ తప్పదని వినిపిస్తోంది.