Begin typing your search above and press return to search.

బాబు మార్కు బ్రేక్‌!..ఎన్ ఐఏ విచార‌ణ‌పై మ‌రో పిటిష‌న్‌!

By:  Tupaki Desk   |   25 Jan 2019 7:58 AM GMT
బాబు మార్కు బ్రేక్‌!..ఎన్ ఐఏ విచార‌ణ‌పై మ‌రో పిటిష‌న్‌!
X
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌లోని గూడు పుఠాని ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందోన‌న్న భ‌యం టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిని వ‌ణికించేస్తున్న‌ట్లుగానే ఉన్న‌ట్టుంది. దాడి జ‌రిగిన వెంట‌నే మీడియా ముందుకు వ‌చ్చి... ఎయిర్ పోర్టులో దాడి జ‌రిగితే... అక్క‌డి భ‌ద్రతా వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించే సీఐఎస్ ఎఫ్‌ దే బాధ్య‌త అని త‌ప్పించుకో జూసిన చంద్ర‌బాబు స‌ర్కారు... కేసు ద‌ర్యాప్తును మాత్ర రాష్ట్ర పోలీసులు కాకుండా ఇత‌ర ద‌ర్యాప్తు సంస్థ‌లు చేప‌డితే... అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డిపోతుంద‌ని నిజంగానే భ‌య‌ప‌డ్డారు. ఎయిర్ పోర్టులో భ‌ద్ర‌త త‌న ప్ర‌భుత్వ ప‌రిధిలోకి రాద‌ని వాదించిన చంద్ర‌బాబు... అక్క‌డ జ‌రిగిన దాడి కేసు ద‌ర్యాప్తు మాత్రం త‌న ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో కాకుండా... వేరే ద‌ర్యాప్తు సంస్థ‌లు ఎలా చేస్తాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ ఒక్క లాజిక్ చాలు... జ‌గ‌న్ పై దాడికి సూత్ర‌ధారులెవ‌రో చెప్ప‌డానికి. పాత్ర‌ధారులెవ‌రైనా - సూత్ర‌ధారులు ఎవ‌రైనా చివ‌ర‌కు న్యాయం ముందు చేతులు క‌ట్టుకుని నిలబ‌డాల్సిందే క‌దా.

ఇదే భావ‌న‌తో ఉన్న జ‌గ‌న్‌... కేసు ద‌ర్యాప్తు రాష్ట్ర పోలీసుల ఆధ్వ‌ర్యంలో జ‌రిగితే నిజాలు బ‌య‌ట‌కు రావ‌ని వాదించారు. అందుకే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో ద‌ర్యాప్తు చేయించాల‌ని ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జ‌గ‌న్ వాద‌న‌తో ఏకీభ‌వించ‌డం - కేసు ద‌ర్యాప్తు అప్ప‌టిక‌ప్పుడు జాతీయ ద‌ర్యాప్తు సంస్థ చేతుల్లోకి వెళ్లిపోవ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయింది. ఈ క్ర‌మంలో ఎన్ ఐఏ అధికారులు ఈ కేసు ద‌ర్యాప్తును ప‌రుగులు పెట్టిస్తున్నారు. జ‌గ‌న్‌ పై దాడి చేసిన శ్రీ‌నివాస‌రావును క‌స్ట‌డీలోకి తీసుకుని విచార‌ణ చేప‌ట్టిన ఎన్ ఐఏ అధికారులు... క‌స్ట‌డీ గ‌డువు ముగియ‌డంతో అత‌డిని కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఈ సంద‌ర్భంగా ఎలాగైనా ఈ ద‌ర్యాప్తున‌కు బ్రేకులు వేయాల‌ని కాసుక్కూర్చున్న చంద్ర‌బాబు స‌ర్కారు... మ‌రోమారు కేసుకు బ్రేకులు వేయించే య‌త్నం చేసింద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఈ కేసుకు సంబంధించి పూర్తి వివ‌రాలు ఇచ్చేందుకు చంద్ర‌బాబు స‌ర్కారు ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) నిరాక‌రిస్తున్న విష‌యం తెలిసిందే. సిట్ తో స‌ద‌రు కొత్త గొడ‌వ‌ను సృష్టించింది చంద్ర‌బాబు స‌ర్కారే క‌దా. ఇప్పుడు అదే సిట్ తో ఎన్ ఐఏకు కొనసాగుతున్న వివాదాన్ని సాకుగా చూపి ఎన్ ఐఏ విచార‌ణ‌ను ఆపివేయించేందుకు ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా ఎన్ ఐఏ - సిట్ ల మ‌ధ్య ఉన్న వివాదం తేలేదాకా కేసు ద‌ర్యాప్తును నిలుపుద‌ల చేయించాల‌ని నిందితుడి త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే ఈ పిటిష‌న్ కూడా కోర్టులో నిలిచే అవ‌కాశాలు లేవ‌ని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ఏదో ఒక కార‌ణాన్ని బూచిగా చూపి కేసు ద‌ర్యాప్తును నిలుపుద‌ల చేయించాల‌న్న చంద్ర‌బాబు య‌త్నాలు ఫ‌లిస్తాయో - అంత‌లోగానే ద‌ర్యాప్తు పూర్తి అయ్యి అస‌లు సూత్ర‌ధారులు బ‌య‌ట‌కు వ‌స్తారో చూడాలి.