Begin typing your search above and press return to search.

సందేశ్​.. వాట్సాప్​ కు పోటీఇవ్వగలదా?

By:  Tupaki Desk   |   21 Feb 2021 1:30 PM GMT
సందేశ్​.. వాట్సాప్​ కు పోటీఇవ్వగలదా?
X
ప్రస్తుతం వాట్సాప్​ యాప్​పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నది. వాట్సాప్​ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై యూజర్లు కోపంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా యూజర్లు.. వాట్సాప్​కు ప్రత్యామ్నాయంగా ఉన్న యాప్​ల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే సిగ్నల్​, టెలిగ్రామ్ వంటి యాప్స్​ డౌన్​లోడ్​ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్రప్రభుత్వం కూడా వాట్సాప్​కు ప్రత్యామ్నాయంగా ‘సందేశ్’ అనే యాప్​ను తీసుకొచ్చింది. వాట్సాప్​కు పోటీగా సందేశ్​లోనూ పలు రకాల ఫీచర్స్​ అందుబాటులోకి ఉన్నాయి. అయితే ఈ సందేశ్​ ఎలా ఉండబోతున్నది. వాట్సాప్​కు పోటీ ఇవ్వబోతుందా? ఇప్పుడు తెలుసుకుందాం.. ​


సందేశ్​ యాప్​ను నేషనల్​ ఇన్ఫర్మేటిక్స్​ సెంటర్​ (ఎన్​ఐసీ) లాంచ్​ చేసింది.
సందేశ్​ యాప్​ను వినియోగించాలంటే మొబైల్​ నంబర్​ లేదా ఈ మెయిల్​ తప్పనిసరి. ఒక్కసారి సైన్​ ఆఫ్​ అయ్యాక యూజర్లు వాట్సాప్​ మాదిరిగానే మెసేజ్​లు, ఫొటోలు, వీడియోలు పంపించుకోవచ్చు. వాట్సాప్​ తరహాలోనే ఇందులో కూడా ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​ ఉండనున్నది. ప్రభుత్వం జీఐఎంఎస్​ పోర్టల్​తో దీనికి సంబంధించిన ఏపీకే ఫైల్​ డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ఐవోఎస్​ వినియోగదారులు యాప్ స్టోర్​లో దీన్ని డౌన్​లోడ్​ చేసుకొని ఐఫోన్​, ఐప్యాడ్​ ద్వారా వినియోగించుకోవచ్చు.
సైన్​ఆఫ్​ అయ్యాక మొబైల్​ నంబర్​కు వచ్చే ఆరు అంకెల ఓటీపీ నంబర్​తో ఈ యాప్​ను ధ్రువీకరించుకోచ్చు. అయితే ఈ యాప్​ చూడటానికి అచ్చం వాట్సాప్​ లాగే ఉన్నప్పటికీ .. కొన్ని వేరే ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయని సాంకేతిక నిపుణులు అంటున్నారు.


ప్రభుత్వ ఉద్యోగులకు వెరిఫైడ్​ అకౌంట్​ కూడా అందిస్తోంది. సందేశ్​ చాట్​ బ్యాకప్​లను ఈ మెయిల్​తోపాటు ఎక్స్​టర్నల్​ లొకేషన్​కు కూడా పంపించుకోవచ్చు.
టెలిగ్రాం, వాట్సాప్​ , సిగ్రల్​ తరహాలోనే దీన్ని డెవలప్​ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే అధికారిక కార్యకలాపాలకు కు ఆ యాప్​ను ఉపయోగించాలని ఉద్యోగులకు కోరుతోంది. ఈయాప్​ను యూజర్లు ఏమేరకు వినియోగిస్తారో వేచి చూడాలి.