Begin typing your search above and press return to search.
ఎలన్ మస్క్ తో ఎఫైర్ పై స్పందించిన నికోల్
By: Tupaki Desk | 27 July 2022 2:36 PM GMTగూగుల్ కోఫౌండర్ సెర్గే బ్రిన్ భార్య నికోల్ షానహాన్ తో ప్రపంచంలోనే అపర కుబేరుడు ఎలన్ మస్క్ ఎఫైర్ పెట్టుకున్నాడని జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సెర్గే బ్రిన్ -ఎలన్ మస్క్ ప్రాణ స్నేహితులు. పార్టీలు, పబ్ లలో ఎంజాయ్ చేస్తుంటారు. ఈ విషయంలో ఇప్పటికే ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు.
సెర్గీ బ్రిన్ భార్యతో తనకు ఎఫైర్.. వారు అందుకే విడిపోయారన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని చెబుతూ ఈ ఫొటోను ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. ‘సెర్గీ, నేను ఫ్రెండ్స్. నిన్న రాత్రి కలిసి పార్టీ కూడా చేసుకున్నాం. అతడి భార్యను మూడేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే చూశాను. అది కూడా చాలా మంది సమక్షంలోనే.. రోమాంటిక్ గా మా మధ్య ఏం జరగలేదు’ అని ఎలన్ మస్క్ వివరణ ఇచ్చాడు.
అయితే ఎలెన్ మస్క్, సెర్గె బ్రిన్ లు మంచి స్నేహితులు. సుధీర్ఘ కాలంగా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2008లో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలెన్ మస్క్ కు చెందిన టెస్లా, స్పేస్ ఎక్స్ కుదేలైంది. దీంతో సెర్గెబ్రిన్ ఆయా సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టి ఆదుకున్నాడు. ఎలెన్ మస్క్ ను ఆర్థికంగా ఆదుకొన్న పాపానికి సెర్గెబ్రిన్ భార్యతోనే ఎలన్ మస్క్ అక్రమ సంబంధం అని వార్తలు వచ్చాయి. ఈ విషయం తమకు మెయిల్ ద్వారా అందిందని అమెరికన్ మీడియా తెలిపింది.
అయితే సెర్గీ భార్యతో తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని.. తాను ఆమెతో రెండు మూడు సార్లు తప్ప కలిసింది లేదని ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ విషయంపై కార్పొరేట్ సెక్టార్లలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఇప్పటికే ఎలెన్ మస్క్ పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనాన్షియల్ గా ప్రపంచంలో నెంబర్ వన్ అయిన ఆయన పర్సనల్ క్యారెక్టర్ మాత్రం చాలా వరస్ఠ్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.ఈ వివాదంతో ఎలన్ మస్క్ మరోసారి బుక్కయ్యాడు.
ఇక టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో ఎఫైర్ పై సెర్గీ భార్య నికోల్ స్పందించింది. మస్క్ తో ఎఫైర్ పెద్ద అబద్దమని.. వార్తలను ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామని నికోల్ లాయర్ ‘డైలీ మెయిల్’కు తెలిపింది. ఈ వార్త ప్రచురించిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఎడిటర్ సికొనోల్ఫీపై మస్క్ సెటైర్ వేశారు. అతడికి జర్నలిజం తెలియదు అంటూ ట్వీట్ చేశాడు. ఇటు మస్క్.. అటు సెర్గీ భార్య క్లారిటీతో ఈ ఎఫైర్ ప్రచారానికి తెరపడినట్టైంది.