Begin typing your search above and press return to search.

ఆమెను దేవత అనకుండా ఎలా ఉండగలం?

By:  Tupaki Desk   |   11 Feb 2016 5:35 AM GMT
ఆమెను దేవత అనకుండా ఎలా ఉండగలం?
X
సియాచిన్ మంచు శకలాల్లో చిక్కుకుపోయి.. ఆరురోజుల పాటు మృత్యువుతో పోరాడిన లాన్స్ నాయక్ హనుమంతప్ప ఉదంతం తెలిసిందే. కాలేయం.. ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బ తినటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయనకు సంబంధించిన వార్తలు దేశ వ్యాప్తంగా ప్రసారం కావటం.. దేశ ప్రజలంతా ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ప్రధాని మోడీ సైతం స్వయంగా హనుమంతప్ప చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకోవటం తెలిసిందే.

దేశమంతా ప్రార్థనలు.. అయ్యో అన్న బాధను వ్యక్తం చేస్తుంటే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక మహిళ మాత్రం అందరికంటే భిన్నంగా స్పందించింది. తనకు ఏ మాత్రం సంబంధం లేకున్నా.. తీవ్రంగా దెబ్బ తిన్న మూత్రపిండాలకు.. తన కిడ్నీ ఒకటి ఇస్తానని ముందుకొచ్చింది. యూపీలోని పడారియా తుల గ్రామానికి చెందిన నిధి పాండే మామూలు గృహిణి. హనుమంతప్ప గురించి మీడియాలో వచ్చిన వార్తలు ఆమెను తీవ్రంగా కదిలేలా చేశాయి. తన భర్తను ఒప్పించిన ఆమె.. తన కిడ్నీని హనుమంతప్పకు ఇస్తానని.. కేవలం ప్రార్థనలతోనే ఆయన ప్రాణాలు నిలువవంటూ ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. తన కిడ్నీని దానం చేయటానికి హెల్ప్ లైన్ ద్వారా సమాచారం అందించిన నిధి పాండేను కంటి ముందు కనిపించే దేవత అనకుండా ఎలా ఉండగలం?