Begin typing your search above and press return to search.

రష్యన్ ఆడవాళ్లతో సెక్స్ వద్దంటున్న కోచ్

By:  Tupaki Desk   |   10 Jun 2018 9:50 AM GMT
రష్యన్ ఆడవాళ్లతో సెక్స్ వద్దంటున్న కోచ్
X
ఫుట్ బాల్ ప్రపంచకప్ సందడి మొదలైంది. అన్నీ దేశాలు ఇప్పుడు ప్రపంచకప్ కు ఆతిథ్యం ఇచ్చే రష్యా దేశానికి చేరుకున్నాయి. అయితే ఫుట్ బాల్ కు సెక్స్ కు అవినాభావ సంబంధం ఉంది. ముందురోజు సెక్స్ లో పాల్గొన్న ఆటగాళ్లు ఫుట్ బాల్ మ్యాచ్ లో రెచ్చిపోయి గోల్స్ కొడతారని.. సెక్స్ లో ఎంజాయ్ చేయాలని అన్ని జట్ల కోచ్ లు ఆటగాళ్లకు సూచిస్తుంటారు. కానీ ఇక్కడ నైజీరియా కోచ్ మాత్రం తమ ఆటగాళ్లకు సెక్స్ కు నో చెప్పాడు.

ఫిఫా ప్రపంచకప్ లో నైజీరియా పాల్గొంటోంది. ఈ సందర్భంగా నైజీరియన్ ఆటగాళ్లకు ఆ టీం మేనేజ్ మెంట్ సెక్స్ లో పాల్గొనకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపడుతోంది. ఈ సందర్భంగా నైజీరియన్ ఆటగాళ్లు అందరూ రష్యాన్ మహిళలతో శృంగారంలో పాల్గొనవద్దని ఆ దేశ జట్టు కోచ్ గెర్నోట్ రోర్ ఆదేశాలు జారీ చేశారు. వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు రష్యా వచ్చిన ప్లేయర్లు స్థానిక రష్యన్ అమ్మాయిలను కలువవద్దని.. వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగారంలో పాల్గొనవద్దని ఆదేశించాడు. అంతేకాదు రష్యన్ మహిళలతో ఎలా మెలగాలనే దానిపై ఓ పుస్తకాన్ని అర్జేంటీనా నుంచి తెప్పించి అందించాడు.

రష్యన్ మహిళలు చాలా తెలివైన వారని.. వారు శృంగారంలో పాల్గొన్న అనంతరం ట్రాప్ లోకి లాగి బ్లాక్ మెయిలింగ్ చేస్తారని.. దాని వల్ల ఆటగాళ్ల లయ దెబ్బతిని ఫుట్ బాల్ సరిగా ఆడక మొత్తం టీం ఓడిపోతుందని కోచ్ ఆటగాళ్లకు హెచ్చరికలు చేశాడట.. కావాలంటే ఆటగాళ్లు తమ భార్యలు - ప్రియురాళ్లను వెంట తెచ్చుకోవచ్చని సూచించాడు. ఇలా నైజీరియన్ కోచ్ చేసిన తాజా ప్రకటన ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది.