Begin typing your search above and press return to search.
బీబీసీ చానెల్ లో భార్యాభర్తల పంచాయితీ!
By: Tupaki Desk | 15 Oct 2016 10:30 PM GMTఈమధ్య కాలంలో ఒక యాంకర్ కం జడ్జి - ఒక లాయర్ - ఒక సైక్రియాటిస్ట్ ఒకే ఫ్యామిలీకి చెందిన రెండు వర్గాలు... ఈ యాంగిల్ లో తెలుగు టీవీ చానల్స్ లో భార్యాభర్తల పంచాయితీల ప్రసారాలు ఎక్కువగానే వస్తున్నాయి. ఇది కేవలం తెలుగు టీవీ ప్రేక్షకులకు మాత్రమే అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ప్రఖ్యాత బీబీసీ చానెల్ లోనూ అలాంటి ఓ భార్యాభర్తల పంచాయితీ తాజాగా ప్రసారం అయింది. అయితే మన తెలుగు చానాల్స్ లో తిట్టుకున్న రేంజ్ లో రచ్చ జరగకపోయినా ఈ పంచాయితీ ఫుల్ పాపులర్ అయిపోయింది. ఇంతకూ అది ఎవరి గురించి అంటారా? ఆఫ్రికాలోనే పెద్ద దేశం నైజీరియాకు అధ్యక్షుడు - ఆమె భార్యకు సంబందించినది!
తాజాగా బీబీసీ లో ప్రసారమైన ఒక కార్యక్రమంలో నైజీరియా అధ్యక్షుడు మొహమ్మదు బుహారీ - తన భార్య అయిషా బుహారీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో "నా భర్తకు స్వయంగా ఆయనే నియమించిన ఉన్నతాధికారులు కూడా గుర్తుండరు.. అన్ని విషయాలు నేనే దగ్గరుండి చూసుకోవాలి. చాలా ఏళ్లుగా ఆ పని చేస్తున్నాను.. అందుకే ఈసారి 2019లో జరగబోయే ఎన్నికల్లో నేనే పోటీకి దిగొద్దని ఆయనకు అల్టిమేటం ఇచ్చాను" అని మాట్లాడారు అయిషా బుహారి. అంతేనా... ఈ మాట కాదని ఎన్నికల్లో పోటీ చేస్తే గనుక... ఆయనకు వ్యతిరేకంగా ఈమె ప్రచారం కూడా చేపడుతుందని ప్రకటించింది... అదే గనక జరిగితే ఆయన కచ్చితంగా ఓడిపోతారు అని తేల్చేసింది.
ఈ సంచలనం వ్యాఖ్యలపై స్పందించిన మొహమ్మదు... "నా భార్య ఏ పార్టీకి చెందిందో చెప్పలేను కానీ, ఆమె మాత్రం నా వంటగదికి - మరికొన్ని కీలకమైన గదులకు చెందిందని అని మాత్రం చెప్పగలను" అని తేల్చేశారు. విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తిచేసి - దేశపాలనలో భర్తకు చేదోడువాదోడుగా ఉంటోన్న ఆమెను పట్టుకుని ఈమె వంట గదికి చెందింది మాత్రమే అని అధక్షుడు వ్యాఖ్యానించడంతో ఇది సర్వత్రా చర్చనీయాంశమైంది.
మరో విషయం ఏమిటంఏ... ఈ వ్యాఖ్యలపై మొహమ్మదు బుహారీ స్పందిస్తున్న సమయంలో నైజీరియాకు అతిథిగా వచ్చిన జర్మన్ చాన్సరల్ ఏంజిలా మోర్కెల్ పక్కనే ఉన్నారు. పాపం ఆ సమయంలో ఆమె మాత్రం ఏమిచేస్తారు చెప్పండి... అతిథిమర్యాద పాటిస్తూ చిన్నగా నవ్వి ఊరుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/