Begin typing your search above and press return to search.
ఏపీ ఆవిర్భావ దినోత్సవ చర్చను రేపిన నైజీరియన్లు
By: Tupaki Desk | 8 Aug 2016 10:23 AM GMT నైజీరియా.. ఆర్థికంగా - సామాజికంగా పెద్దగా అభివృద్ధి చెందని ఈ దేశ యువత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. తమ దేశంలో సరైన విద్యావకాశాలు లేకపోవడంతో నైజీరియన్లు తెలుగు రాష్ట్రాల్లోని కాలేజిలు - యూనివర్సిటీల్లో చదువుతున్నారు. వారంతా ఆదివారం (ఆగస్టు 7) తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు ఇంజనీరింగ్ - మేనేజ్ మెంట్ కళాశాలల్లో చదువుతున్న నైజీరియా విద్యార్థులు ఆదివారం ఈ వేడుకల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. వీటికి స్థానిక ప్రజాప్రతినిధుల్ని అతిధులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంలో ఓ చర్చ జరిగిది. ఆవిర్భావ దినోత్సవం గురించి నైజీరియా విద్యార్థులు - సీమాంధ్ర నేతల మధ్య సంభాషణ జరిగింది. తామెక్కడున్నా తమ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటామంటూ నైజీరియన్ విద్యార్థులు చెప్పడంతోపాటు మీ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడంటూ ప్రశ్నించారు.
ఆగస్టు 15న స్వతంత్రమొచ్చింది.. జనవరి 26రిపబ్లిక్ గా ప్రకటించుకున్నాం.. ఈ రెండ్రోజుల్ని దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకుంటామంటూ చెప్పినప్పటికీ నైజీరియన్ విద్యార్థులు సంతృప్తి చెందలేదు. నైజీరియా దేశ స్వతంత్ర వేడుక ల్తో పాటు దేశంలోని లాగోస్ - అబూజ - తలబార్ - థానో - ఇబాడాన్ - బెనిన్ ఇలా ఒక్కో ప్రాంతానికి చెందిన ఆవిర్భావ దినోత్సవాల్ని విడివిడిగా జరుపుకుంటాం.. మరిమీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటూ వేసిన ప్రశ్నకు సీమాంధ్ర నేతలు బదులివ్వలేక పోయారు.
దీంతో నవ్యాంధ్ర పరిస్థితి ఎందుకిలా అయిందంటూ ప్రజాప్రతినిధులు ఆవేదనచెందారు. ప్రతి వ్యక్తికి ఓ పుట్టిన రోజుంటుంది.. అలాగే ప్రతి సంస్థకు ఏర్పాటు చేసిన రోజుంటుంది. ఇక దేశం - రాష్ట్రాలకు ఆవిర్భావ దినోత్సవాలుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం అన్నదే లేకుండా పోయింది. స్థానిక రాజకీయ ప్రయోజనాలకనుగుణంగా విభజన ఆగ్రహాన్ని ప్రజల మది నుంచి దూరం కాకుండా ఎప్పటికీ సజీవంగా ఉంచాలన్న లక్ష్యంతోనే పాలకులు ఆవిర్భావ దినోత్సవాన్ని కావాలనే లేకుండా చేశారన్న ఆందోళన ఇప్పుడు నెలకొంది. అదికూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా పుట్టిన ఇటలీ దేశ స్వతంత్ర దినోత్సవం జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ ను రెండుగా విభజించడం - తెలంగాణా ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించడంతోనూ ఏపీ ఆ తేదీని అంగీకరించడం లేదన్న అభిప్రాయం ఉంది.
నిజానికి దేశంలో మరే రాష్ట్రానికి లేనన్ని పుట్టినరోజులు ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయి. మద్రాస్ నుంచి విడివడ్డ ఆంధ్రదేశం అక్టోబర్ 1న ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించింది. అనంతరం తెలంగాణా విలీనంతో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కు నవంబర్ 1 పుట్టినరోజైంది. కాగా ఇదే ఆంధ్రప్రదేశ్ జూన్ 2 ఆంధ్రప్రదేశ్ - తెలంగాణాలుగా విడివడింది. అదే రోజు తెలంగాణా ఆవిర్బావ దినంగా మారింది. ఈ మూడింటిలో ఏదొక రోజును ఆంధ్రప్రదేశ్ ఆవిర్బావ దినోత్సవంగా ప్రకటించాలన్న డిమాండ్ మరోసారి మొదలైంది.