Begin typing your search above and press return to search.
ఒమిక్రాన్ దెబ్బకు నైట్ కర్ఫ్యూ.. ఇంపాక్ట్ ఇంకా గట్టిగానే
By: Tupaki Desk | 27 Dec 2021 6:48 AM GMTదేశంలో ఒమిక్రాన్ దెబ్బ బాగా గట్టిగానే పడుతున్నట్లుంది. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు మొదలైపోయాయి. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, అస్సాం, బెంగుళూరు లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఒకవైపు ఒమిక్రాన్ కేసుల తీవ్రత పెరిగిపోతుండటం మరోవైపు జనాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవటమే దీనికి ప్రధాన కారణాలుగా చెప్పాలి. దేశం మొత్తం మీద ఇప్పటికి సుమారు 600 కేసుల వరకు నమోదయ్యాయి.
ఒమిక్రాన్ అనుమానిత పరీక్షలు రిజల్ట్స్ ఇంకా చాలా రాష్ట్రాల్లో అధికారులకు అందాల్సుంది. ఈలోగానే ముందు జాగ్రత్తగా ప్రభుత్వాలు కర్ఫ్యూలు విధించేయటం మొదలుపెట్టాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ లో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. అందుకనే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఈ ప్రభుత్వాలు. ఏపీలో ఇప్పటికి బయటపడిన ఒమిక్రాన్ కేసులు రెండు మాత్రమే. అయినా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
చాలా రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తగా జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలను విధించారు. పబ్లిక్ ప్లేసుల్లో గుమిగూడటాన్ని నిషేధించారు. న్యూ ఇయర్ వేడుకలను కొన్ని రాష్ట్రాల్లో నిషేధించాయి. మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే 1650 కేసులు నమోదయ్యాయి. వీటిలో ముంబైలో మాత్రమే సుమారు 900 కేసులు రికార్డయ్యాయి. ఇండోర్ లో ఆదివారం మాత్రమే 9 ఒమిక్రాన్ నిర్ధారిత కేసులు బయటపడ్డాయి. ముందు జాగ్రత్తగా కొన్ని రాష్ట్రాలైతే తమ పొరుగు రాష్ట్రాల సరిహద్దులను మూసేశాయి.
మరికొన్ని రాష్ట్రాలు సరిహద్దుల్లో పోలీసులతో పాటు వైద్య సిబ్బందిని ఉంచి వచ్చేవారికి కరోనా వైరస్ టెస్టులు చేయిస్తున్నాయి. ఇలాంటి చర్యలతో జనాల్లో గోల మొదలైపోయింది. అందరికీ వ్యాక్సిన్లు దొరక్కపోవటం, మరికొందరు నిర్లక్ష్యంగా ఉండి వ్యాక్సిన్లు తీసుకోకపోవటం తదితర కారణాలతో కరోనా వైరస్ మళ్ళీ పెరిగిపోతున్నాయి. మనదేశంలో భౌతిక దూరం పాటించటం ఎలాగూ సాధ్యంకాదు. కనీసం మాస్కులు కూడా చాలామంది ధరించటంలేదు. దీంతోనే అసలు సమస్యలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో ఏమో.