Begin typing your search above and press return to search.

ఈ రోజు నుంచి ఢిల్లీలో నైట్ క‌ర్ఫ్యూ

By:  Tupaki Desk   |   6 April 2021 7:17 AM GMT
ఈ రోజు నుంచి ఢిల్లీలో నైట్ క‌ర్ఫ్యూ
X
దేశంలో గత ఏడాదిలానే మళ్లీ కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌ డౌన్ వేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపధ్యంలో దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో ప్రతీరోజూ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య 4 వేలకు చేరువలో ఉంది. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన కేసుల సంఖ్య కన్నా ఇది కాస్త అధికం. పాజిటివిటీ రేట్ కూడా 5 శాతం మేరకు పెరిగింది. డబ్ల్యు హెచ్ఓ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పడున్న పరిస్థితిని అదుపులో ఉన్నట్లు భావించవచ్చు.

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధిస్తు నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈరోజు నుంచి ఏప్రిల్ 30 వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఢిల్లీలో ఫోర్త్ వేవ్ కొన‌సాగుతోంద‌ని, లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌ల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించిన త‌ర్వాతే లాక్ ‌డౌన్ ‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూతో పాటుగా ఉదయం 144 సెక్షన్ సీఆర్పీసి, వీకెండ్స్ లో లాక్ డౌన్ కూడా మహారాష్ట్రలో అమలు చేస్తున్నారు. ఇక దేశంలో ఈరోజు బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 96వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.