Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో రాత్రి కర్ఫ్యూ ... క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి !

By:  Tupaki Desk   |   22 March 2021 7:37 AM GMT
హైదరాబాద్ లో రాత్రి కర్ఫ్యూ ... క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి !
X
దేశవ్యాప్తంగా కరోనా కేసులు కొంచెం కొంచెంగా మరోసారి పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌ తో ఇప్పటికే పలు రాష్ట్రాలు పాక్షిక లాక్‌ డౌన్, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. తెలంగాణలోనూ కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా స్కూళ్లలో ఎక్కువ కేసులు నమోదవున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ లో వీకెండ్స్ తో పాటు నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వారంలో రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధించాలా, లేదంటే రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలా అనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఒకటి, రెండు రోజుల్లో దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

అయితే , దీనిపై తాజాగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించే ఆలోచన ప్రభుత్వానికి ఇప్పటికైతే లేదు అని స్పష్టం చేశారు. ఓల్డ్ సిటీ లోని మిర్చౌక్ ప్రాంతంలో భరోసా కేంద్రానికి పునాది వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మహమూద్ అలీ భారతదేశం అంతటా అలానే పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, హైదరాబాద్‌ లో రాత్రి కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్ లు రాష్ట్ర ప్రభుత్వం విధించే ప్రణాళికలు లేవని అన్నారు. ఈ లాక్ డౌన్ అనేది ప్రజల జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి పోలీసులు కర్ఫ్యూ విధించే ఉద్దేశం లేదని మహమూద్ అలీ తెలిపారు. కేసుల పెరుగుదల నియంత్రించడంలో ప్రజలే ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. కర్ఫ్యూ విధించడం నగరంలోని అనేక మంది జీవితాలను, వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుందని స్పష్టం చేస్తూ, మహమూద్ అలీ ప్రజలు, ముఖ్యంగా ఓల్డ్ సిటీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని అనవసర సమావేశాలను నివారించాలని మరియు ఫేస్ మాస్క్‌లను వెంటనే ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.