Begin typing your search above and press return to search.

ఆ నాలుగు నగరాల్లో రాత్రి కర్ఫ్యూ .. త్వరలో సంపూర్ణ లాక్ డౌన్

By:  Tupaki Desk   |   16 March 2021 5:30 PM GMT
ఆ నాలుగు నగరాల్లో రాత్రి కర్ఫ్యూ .. త్వరలో సంపూర్ణ లాక్ డౌన్
X
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి చాలా వేగంగా విస్తరిస్తుంది. కొద్దిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలో వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. మొన్నటిదాకా మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యేవి , అవి కాస్త పొరుగు రాష్ట్రాలకూ విస్తరిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌ కరోనా వైరస్ కొత్త కేసులకు హాట్ స్పాట్‌ గా మారింది. ఫలితంగా లాక్‌ డౌన్ తరహా పరిస్థితులు అక్కడ ముసురుకుంటున్నాయి. కొద్దిరోజులుగా గుజరాత్‌లో కరోనా వైరస్ కేసుల పెరుగుదల అనూహ్యంగా ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్‌ను ప్రత్యక్షంగా తిలకించడంపై నిషేధం విధించారు. నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రేక్షకుల రాకను నిషేధించారు.

ఈ పరిణామాల మధ్య నాలుగు ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌ కోట్ ‌లల్లో రాత్రివేళ కర్ఫ్యూను విధించారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ నెల 31వ తేదీ వరకు ఇదే పరిస్థితిని కొనసాగించనున్నారు. ఆ తరువాత కరోనా వైరస్ రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తే దాన్ని ఎత్తేస్తారు. లేదంటే.. మరింత విస్తరించే అవకాశాలు లేకపోలేదు.

ఇప్పటికే అహ్మదాబాద్‌ లోని ఎనిమిది ప్రాంతాల్లో పాక్షికంగా లాక్‌ డౌన్‌ ను అమలు చేస్తున్నారు. జోధ్‌ పూర్, నవ్ ‌రంగ్ పుర, బోడక్ ‌దేవ్, థల్ తేజ్, గోటా, పాల్డీ, ఘట్లోడియా, మణినగర్ వార్డల్లో లాక్‌ డౌన్ కొనసాగుతోంది. రోజువారీ కరోనా కేసులు ఏ మాత్రం తగ్గకపోవడంతో నైట్ నగరం వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను అమల్లోకి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం ఆ నాలుగు నగరాల్లో రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమలవుతోంది.