Begin typing your search above and press return to search.
నిహారిక @నంబర్ 37
By: Tupaki Desk | 5 April 2022 3:56 AM GMTహైదరాబాద్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌పై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులకు డ్రగ్స్ దొరకడం.. ఆ సమయంలో పబ్‌లో ప్రముఖుల పిల్లలు ఉండడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి దాటాక కూడా పార్టీలో వీళ్లు ఎంజాయ్ చేస్తూ కనిపించారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులకు డ్రగ్స్ దొరకడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు డ్రగ్స్‌ను అరికట్టాలంటూ కేసీఆర్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇస్తుంటే ఇలా పబ్‌లో మాదక ద్రవ్యాలు దొరకడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక ఆ సమయంలో పబ్‌లో ఉన్న 145 మంది వివరాలను పోలీసులు సేకరించారు.
ఈ 145 మందిలో సినీ, రాజకీయ, వ్యాపార, పోలీస్ రంగాలకు చెందిన ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. అందులో బిగ్‌బాస్ విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఉండడం సంచలనంగా మారింది. అయితే నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారని, పబ్‌ను అనుమతించిన సమయం దాటాకా కూడా నడిపినందుకు నిర్వాహకులపై కేసు నమోదు చేశారని నాగబాబు పేర్కొనడం తెలిసిందే.
కానీ తాజాగా ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు పార్టీకి హాజరైన వాళ్ల లిస్టులో మార్పులు చేర్పులు చేశారు. జాబితాలో 37వ నంబర్‌గా నిహారిక పేరు చేర్చినట్లు తెలుస్తోంది.
అసలు తనకు సంబంధం లేదని పోలీసులు చెప్పారని నాగబాబు అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆమె పేరును లిస్టులో చేర్చారు. ఇక 38వ నంబర్‌గా మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమార్తె పేరు కూడా ఎంట్రీ చేసినట్లు సమాచారం.
డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా నిహారికను పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పబ్ నుంచి పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లిన 145 మంది వివరాలు తీసుకుని సొంత పూచీకత్తుపై పోలీసులు వాళ్లను వదిలేసిన సంగతి తెలిసిందే.
కానీ ఇప్పుడు విచారణ వేగవంతం చేసిన పోలీసులు వాళ్లతో మాట్లాడే అవకాశం ఉంది. గతంలో అపార్ట్‌మెంట్‌లో అల్లరి చేస్తున్నారంటూ నిహారిక, ఆమె భర్తపై చుట్టుపక్కల వాళ్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.