Begin typing your search above and press return to search.
ట్రంప్ కేబినెట్ లో లేడీ ఎన్నారైకు కీలక పదవి
By: Tupaki Desk | 17 Nov 2016 3:38 PM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ లో ఓ ఎన్నారై లేడీకి కీలకపదవి దక్కనుందన్న వార్తలు యూఎస్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా విజయం సాధించిన ట్రంప్ తన మంత్రివర్గంలో ఆమెకు చోటు కల్పిస్తారని కథనాలు వస్తున్నాయి. ఇండో - అమెరికన్ అయిన 44 ఏళ్ల నిక్కీహేలీకి కీలక పదవి దక్కుతుందని తెలుస్తోంది.
హేలీ ఇప్పటికే నార్త్ కరోలినా రాష్ట్రానికి వరుసగా రెండోసారి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఆమెకు ట్రంప్ తన కేబినెట్ లో కీలకమైన విదేశాంగ శాఖా మంత్రి ఇస్తారని సమాచారం. ఇప్పటికే ట్రంప్ ఈ విషయమై కసరత్తు కూడా పూర్తి చేశారని..త్వరలోనే వీరిద్దరు సమావేశమవుతారని కూడా ట్రంప్ సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ట్రంప్ ను హేలీతో పాటు మాజీమంత్రి హెన్సీ కిస్సింగర్ - రిటైర్డ్ జనరల్ జాన్ కీనే - అడ్మిరల్ మైక్ రోజర్స్ - కెన్ బ్లాక్ వెల్ లాంటి ప్రముఖులు కూడా కలవనున్నారు. ఇక ఇప్పటికే అమెరికాలో పలుసార్లు చట్ట సభలకు ఎంపికైన మరో ఎన్నారై బాబీ జిందాల్ కు సైతం కేబినెట్ పదవి దక్కుతుందని అంచనా.
బాబీ జిందాల్ ఇప్పటికే రెండుసార్లు లూసియానా గవర్నర్ గా పనిచేశారు. ఆయనకు ట్రంప్ ఆరోగ్యశాఖా మంత్రి పదవి ఇచ్చే ఛాన్సులున్నాయి. ఈ ఇద్దరు ఎన్నారైలకు ట్రంప్ తన కేబినెట్ లో చోటు కల్పిస్తే ట్రంప్ కేబినెట్ లో చోటు దక్కించుకున్న తొలి ఇండో - అమెరికన్లుగా వీరు నిలుస్తారు. ఇక పలువురు ప్రముఖులు ట్రంప్ ను కలుస్తూ కేబినెట్ లో చోటు కోసం విజ్ఞప్తులు చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/