Begin typing your search above and press return to search.

నిర్ణయం మార్చుకున్న నిమ్మగడ్డ

By:  Tupaki Desk   |   20 March 2021 4:42 AM GMT
నిర్ణయం మార్చుకున్న నిమ్మగడ్డ
X
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎల్టీసీ శెలవును రద్దు చేసుకున్నారు. ఈనెల 25-28 తేదీల మధ్య ఎల్టీసీ శెలవుపై కుటుంబంతో కలిసి రామేశ్వరం వెళ్ళేందుకు కమీషనర్ అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే హఠాత్తుగా ప్రివిలేజ్ కమిటి నోటీసు రూపంలో నిమ్మగడ్డకు అడ్డంకులు మొదలైంది. ఇద్దరు మంత్రులను కించపరిచిన విషయంలో విచారణ ఎదుర్కోవాల్సుంటుందని నోటీసులో ప్రివిలేజ్ కమిటి చెప్పింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరై సంజాయిషి ఇచ్చుకోవాలి కాబట్టి అందుబాటులో ఉండమని చెప్పింది.

విచారణకు అందుబాటులో ఉండమని చెప్పిన కమిటి విచారణ తేదీని చెప్పలేదు. దాంతో కమిటి ఎప్పుడు విచారణకు పిలుస్తుందో తెలీదు కాబట్టి తన ఎల్టీసీని రద్దుచేసుకున్నట్లు అనిపిస్తోంది. అయితే నిమ్మగడ్డ మాత్రం తాను కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కారణంగా డాక్టర్ల సలహామేరకు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లు చెప్పారు. కమిటి తనకిచ్చిన నోటీసుకు కమీషనర్ సమాధానమిస్తు తాను ప్రివిలేజ్ కమిటి అధికారాల పరిధిలోకి రానని చెబుతునే కమిటి వాంఛిస్తే విచారణకు హాజరవుతానని చెప్పటమే విచిత్రంగా ఉంది.

మొత్తం మీద ప్రివిలేజ్ కమిటి నోటీసుదెబ్బకే నిమ్మగడ్డ తన ఎల్టీసీ శెలవును రద్దు చేసుకున్నట్లు అర్ధమైపోతోంది. దీనికి కరోనా టీకాను సాకుగా చెప్పుకుంటున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కారణంగా ప్రయాణాలు వద్దని డాక్టర్లు చెప్పారట. టీకా తీసుకుంటే ప్రయాణాలు చేయకూడదని ఇప్పటివరకు ఏ డాక్టరు ఎవరికీ చెప్పిన దాఖలాల్లేవు. కాకపోతే టీకా తీసుకున్న తర్వాత ఓ అర్ధగంట పాటు అబ్సర్వేషన్లో ఉండమంటారు. ఎందుకంటే ఏమైనా రియాక్షన్ వస్తుందేమో పరిశీలించేందుకు.

సో నిమ్మగడ్డ సమాధానం చూసిన తర్వాత ప్రివిలేజ్ కమిటి నోటీసు ప్రభావం ఎంతగా పడిందో అర్ధమైపోతోంది. తనపై కమిటి యాక్షన్ తీసుకోదలిచితే అడ్డుకునే వాళ్ళు కూడా లేరని నిమ్మగడ్డకు బాగానే తెలిసుంటుంది. అయినా తాను కమిటి విచారణ పరిధిలోకి రానని సమర్ధించుకుంటున్నారు. మహారాష్ట్రలో గతంలో ఇలాంటి వివాదమే రేగినపుడు అక్కడి ప్రివిలేజ్ కమిటి అక్కడ స్టేట్ ఎలక్షన్ కమీషనర్ ను విచారించి జైలుశిక్ష విధించిన విషయం నిమ్మగడ్డకు తెలీకుండానే ఉంటుందా ?