Begin typing your search above and press return to search.
ఆ అధికారులపై నిమ్మగడ్డ ఫైర్..5 గంటల వరకు టైం..ఆ తర్వాత ఏం జరగబోతుంది!
By: Tupaki Desk | 22 Jan 2021 11:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య కొనసాగుతున్న వివాదం మరింత కాకరేపుతుంది. రేపు(శనివారం) పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని సిద్ధమవుతున్న ఎస్ ఈ సీ , ఇందులో భాగంగా పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం మూడు గంటలకు తమతో సమావేశం కావాలని గోపాలకృష్ణ ద్వివేది, గిరాజ శంకర్ ను కోరింది.
అయితే వారు ఈ సమావేశానికి రాలేదు. దీనితో వారిపై ఏపీ ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సీరియస్ అయ్యారు. చివరి అవకాశంగా సాయంత్రం 5 గంటలకు తన ముందు హాజరుకావాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి మెమో జారీ చేసింది. ఐదు గంటల తరువాత కూడా వారు రాకపోతే ఏం చేయాలనే దానిపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమాలోచనలు జరుపుతున్నారు.
మరోవైపు ఈ ఇద్దరు అధికారులు ఉదయమే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. దీంతో వీరిద్దరూ ఎస్ ఈ సీ తో సమావేశానికి హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ తాను చెప్పిన 5 గంటలకు తనతో సమావేశానికి అధికారులు హాజరుకాకపోతే ఎస్ ఈ సీ వారిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటుందన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.