Begin typing your search above and press return to search.

సందిగ్దంలో నిమ్మగడ్డ..ఏం చేస్తారో ?

By:  Tupaki Desk   |   19 March 2021 4:13 AM GMT
సందిగ్దంలో నిమ్మగడ్డ..ఏం చేస్తారో ?
X
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ రిటైర్మెంట్ కు కొద్దిరోజుల ముందు సందిగ్దంలో పడ్డారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సుంది. అయితే పరిషత్ ఎన్నికల మాటెత్తటం లేదు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సమయం ఉన్నా మరెందుకనో నిమ్మగడ్డ పరిషత్ ఎన్నికల నిర్వహణ పై మాట్లాడటం లేదు. పైగా ఈనెల 22-24 మధ్య లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ)పై శెలవులో వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ నుండి ఆమోదం కూడా పొందారు.

అయితే ఊహించని రీతిలో ప్రివిలేజ్ కమిటి రూపంలో నిమ్మగడ్డకు సమస్య ఎదురైంది. గతంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ పట్ల అనుచితంగా ప్రవర్తించారని, అవమానించారని పేర్కొంటు నిమ్మగడ్డపై ప్రివిలేజ్ కమిటికి ఫిర్యాదు అందింది. మంత్రులు చేసిన ఫిర్యాదుపై రెండోసారి సమావేశమైన కమిటి నిమ్మగడ్డ నోటీసులిచ్చింది. ఆ నోటీసులో కమిటి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టంగా చెప్పింది.

విచారణకు కమిటి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులో ఉంది. దాంతో నిమ్మగడ్డ ఎల్టీసీపై వెళ్ళే విషయం సందిగ్దంలో పడింది. మంత్రులిద్దరినీ అవమానించారనే ఆరోపణలపై వ్యక్తిగతంగా హాజరై సంజాయిషి ఇవ్వాల్సుంటుందని నోటీసులో ఉంది. అసలు విచారణకు కమీషనర్ హాజరవుతారా లేదా అన్నదే ఇంకా తేలలేదు. విచారణకు నిమ్మగడ్డ హాజరైనా సమస్యే, హాజరు కాకపోయినా సమస్యే. ఎందుకంటే నిమ్మగడ్డ మీద యాక్షన్ తీసుకోవాలని కమిటి గనుక నిర్ణయిస్తే దాన్ని ఎవరు ఆపలేరు.

ఈ విషయం నిమ్మగడ్డకు కూడా బాగా తెలుసు. మరి ఈ పరిస్ధితుల్లో కమీషనర్ ఏమి చేస్తారనేది సస్పెన్సుగా మారింది. విచారణ సంగతి దేవుడెరుగు ముందు ఎల్టీసీపై వెళ్ళాలన్నా కమిటి ఛైర్మన్ తో మాట్లాడాల్సుంటుంది. ఎల్టీసీపై వెళ్ళిన వెంటనే విచారణకు హాజరు కావాలని కోరితే నిమ్మగడ్డ ఇబ్బంది పడిపోతారు. అందుకనే ఏమి కమీషనర్ ఏమి చేస్తారనేది అంతుపట్టకుండా ఉంది.